మహిళామణులకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. ఈ మాసంలో మంగళ, శుక్రవారాల్లో పసుపు, కుంకుమ, పువ్వులు, దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శ్రావణమాసంలో ప్రతి రోజూ పవిత్రమేనదే. ముఖ్యంగా సోమవారాలు అభిషేక ప్రియుడయిన పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా మంగళవారాలు గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తిశ్రద్దలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. వృద్ధిని, సంపదని, ఆయురారోగ్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించి ఆతల్లి అనుగ్రహం పొందుదాం.
No comments:
Post a Comment