కనిపెంచిన తల్లిదండ్రులను నిర్ధాక్షిణంగా ఇంటినుంచి తరిమేస్తున్న కొడుకులు కొందరైతే, కన్నపేగును తెంచుకొని పుట్టిన బిడ్డల్ని అనాధలుగా రోడ్డుపై వదిలేస్తున్న తల్లిదండ్రులు మరికొందరు. ఇతర
ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి పట్టణాలలో వదిలేసేవారు ఇంకొందరు. ఇలా తమ పేగుబంధాన్ని దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో అనాధుల పాలిట ఆపద్భాందవులు, మానవత్వం ఉన్న మనుష్యులు ఇంకా ఉన్నారని 'ఆపన్న హస్తాలు' ముఖపుస్తకం ద్వారా కొందరు మిత్రులు తెలియజేస్తున్నారు. ప్రతి నెలా తమ సంపాదనలో కొంత డబ్బు కనీసం వంద రూపాయలు తగ్గకుండా అనాధుల కోసం కేటాయిస్తూ ఉడతాభక్తితో సమర్పించుకుంటున్నారు. వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
No comments:
Post a Comment