Thursday, 29 November 2012
Thursday, 22 November 2012
అవినీతీ..... నీదారి ఎటు?
ఇప్పుడు కొందరు రాజకీయ నాయకుల నోట వినిపిస్తున్న కొత్త మాట 'అవినీతి పైన పోరాటం'. ఇటీవల పెద్ద పెద్ద కుంభకోణాలు అనేకం బైట పడ్డాయి. కాని, ఈ కుంభకోణాలకు పాల్పడిన వారే అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చిత్తసుద్ధి లేని ఇలాంటి నాయకుల కారణంగా ప్రభుత్వ శాఖలన్నిటిలోనూ అవినీతి తాండవం చేస్తోంది.ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఇటు నాయకులలోనూ, అటు ప్రభుత్వ సిబ్బంది లోనూ లోపించడంతో సమాజానికి 'అవినీతే' ప్రధాన శత్రువు గా మారింది. నాయకుల మనస్తత్వాలు మారనంత వరకు ఈ అవినీతి చాప క్రింద నీరులా ఉంటూనే ఉంటుంది.వీరి మాటలకు మోసపోకుండా అవినీతికి పాల్పడుతున్న వారిని నిలదీయాలి.... ప్రశ్నించాలి!
Sunday, 18 November 2012
మన తెలుగు సినిమాలకు గ్రహణం
మన హిందూ సంస్కృతిలో బ్రాహ్మణులకు మర్యాదపూర్వక మైన గౌరవం వుంది. హిందూ సంప్రదాయాలను, సంస్కృతిని వారినుండి ప్రజలు తెలుసుకుంటూ ఉంటారు. దేవాలయాలలో దేవుడిని దర్శించుకున్నాక పురోహితుడి పాదాలకు మొక్కుతారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని సినిమాలలో పెట్టి హాస్యం పండించాలనుకోవడం మెడ మీద తలకాయ వున్నవారు ఎవరూ ఆలోచించరు.
అదేవిధంగా మన సమాజంలో ఉపాద్యాయ వృత్తి ఏంతో గౌరప్రద మైంది. సమాజంలోని ప్రతి రంగంలోనూ ఉపాధ్యాయుని ప్రభావం కచ్ఛితంగా ఉంటుంది. తల్లితండ్రుల తర్వాత మనిషి వ్యకిత్వ వికాసంలో అద్యాపకులదే కీలక పాత్ర. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారంటే అందులో ముఖ్య పాత్ర ఉపాద్యాయులదే. అలాంటి గురువులను సినిమాలలో జోకర్ గా చూపించి విద్యార్థుల చేత ఆట పట్టించడం ఎంతవరకు సమంజసమో దర్శక, నిర్మాతలు ఆలోచించాలి. సినిమా ప్రారంభం రోజు ఏంతో భక్తి శ్రద్ధలతో భగవంతుడికి కొబ్బరకాయ కొట్టి తొలి ముహూర్తపు షాటు తీస్తారు. అలా పవిత్రంగా మొదలైన సినిమా నిండా బూతు సన్నివేశాలు నింపడం ఎందుకో సినీ పెద్దలకే తెలియాలి.
సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటి పరిష్కార దిశగాఎన్నో చిత్రాలను తీయవచ్చు. అలా చేయకుండా సమాజాన్ని అవమానపరచేలా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలను నిర్మించాలనే ఉద్దేశం దర్శక, నిర్మాతలకు కలగడం చారించతగ్గ విషయం. ఎప్పటికైన సినీపెద్దలు కొంచెమయినా నైతికంగా ఆలోచించాలి. అశ్లీలత, అసభ్యతే లక్ష్యంగా కొన్ని వర్గాలను కించపరచే విధంగా సినిమాలను నిర్మించి, ప్రజాప్రదర్శనకు ఆమోదయోగ్యం కాదని గుర్తించాలి. ఆర్ధిక ప్రయోజనాల కోసం కులాలను వాడుకోవడం, కొన్ని ప్రాంతాలవారిని అవమానపరచడం సంస్కారం అనిపించుకోదు.

అక్టోబర్, నవంబర్ లో విడుదలయిన కొన్ని సినిమాలను చూస్తుంటే అసలు తెలుగు సినిమాలకు సెన్సార్ బోర్డు అన్నది ఒకటి ఉందా? అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు నెలలలో వచ్చిన చిత్రాలలో కొన్ని సామాజికవర్గాలను కించపరచే సన్నివేశాలు, విచ్చలవిడిగా బూతుల మాటలు, అశ్లీలత సన్నివేశాలు, దబుల్ మీనింగ్ డైలాగులున్న సినిమాలకు సెన్సార్ ముద్రవేసి సమాజం పైకి వదిలేశారు.సెన్సార్ సభ్యులకు సినిమాలలోని బూతు మాటలు వినిపించలేదు. హీరోయిన్ జానెడు బట్టలు కట్టి గెంతినా కనిపించలేదు. పనిగట్టుకొని ఓ వర్గాన్నో, మతాన్నో కించపరచినా పట్టించుకోలేదు . ఇలాంటి సెన్సార్ మెంబర్స్ మనకు దొరకడం మన తెలుగువారి దౌర్భాగ్యం.
Thursday, 15 November 2012
గోరంత పూజకి కొండంత ప్రతిఫలం!

తెలుగు మాసాలలో కార్తిక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుంది భక్తుల నమ్మకం. కార్తిక మాసంలో శివుడికి అభిషేకములు, మారేడుదళాలు సమర్పించినా శివ కటాక్షం లభిస్తుందంటారు. ఈ మాసంలో కార్తిక స్నానం, తులసి పూజ, శివకేశవుల స్తోత్ర పారాయణం, పూర్ణిమ, ఏకాదశులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Monday, 12 November 2012
దీపం... 'లక్ష్మీ దేవి' ప్రతిరూపం!
మన ముఖ్య పండుగలలో దీపావళి ఒకటి. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగ భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. పండుగలన్నీ సూర్యోదయంతో మొదలయితే, దీపావళి మాత్రం సుర్యాస్తమయంతో మొదలవుతుంది. ఇంటిల్లిపాదీ పిల్లలు, పెద్దలు అందరూ కలసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ.
దీపావళి రోజు లక్ష్మీ పూజ ప్రధానం. అజ్ఞానాన్ని పారద్రోలే సాక్షాత్తు లక్ష్మీదేవి అని, దీపం వున్నా చోట జ్ఞాన సంపద ఉంటుందంటారు. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తే సర్వ సంపదలు సిద్దించి, సర్వ శుభాలు కలుగుతాయంటారు. అంతే కాకుండా లక్ష్మీ సహస్ర నామాలతో లక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీ సంపన్నురాలై, అష్టైశ్వర్యాలను ఇస్తుందని ప్రజల విశ్వాసం.
అమావాస్య చీకట్లను పారద్రోలే దీపం లక్ష్మీ దేవి ప్రతిరూపం. అందుకే దీపాలను తోరణాలుగా అమర్చి ఐశ్వర్య లక్ష్మీని పుజిస్తారు. ఈ రోజున టపాసులను కాలిస్తే, మానవ జీవితాలలో వెలుగులు విరజిమ్ముతాయని నమ్ముతారు. అయితే టపాసులను పేల్చడంలో ప్రమాదాలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. పెద్దలు, పిల్లల దగ్గరుండి టపాసులను కాల్పించాలి.
మిత్రులందరికీ ...దీపావళి శుభాకాంక్షలు!Friday, 9 November 2012
Thursday, 8 November 2012
Sunday, 4 November 2012
Saturday, 3 November 2012
Subscribe to:
Posts (Atom)