ప్రకృతిలో జరిగే మార్పులకు వేదిక మకర సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు ఆరు నెలలు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయనంలోకి అడుగు పెడతాడు. ఆ రోజునుంచి హైందవ సంప్రదాయం ప్రకారం అత్యంత శుభాదాయకరమైన సమయం. పితృదేవతలకు పిండివంటలు, కొత్త బట్టలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వలన పితృదేవతలు తృప్తి పడతారని గట్టి విశ్వాసం. ఈ విధంగా పెద్దలకు భక్తి ప్రపత్తులతో నైవేద్యం సమర్పించుకోవటం సంక్రాంతి ప్రత్యేకత. హరిదాసులు, గంగిరెద్దులవాళ్ళు, పగటివేశాగాల్లతో గ్రామాలన్నీ కళను సంతరించుకుంటాయి. స్త్రీలు ఉదయాన్నే లేవడం, ఇంటిముందు కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గులు వేయడం, పసుపు, కుంకుమలతో ఇంటి గడపను అలంకరించడం ఆనవాయితి. సంక్రాంతి అంటే మన సంప్రదాయాని మరచిపోకుండా గుర్తుచేసుకోవడం. మన సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతి వాకిళ్ళు కళకళ లాడుతూ ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని మనసార కోరుకుందాం.
6 comments:
మీకు కూడా ఆనందమయ పండుగ శుభాకాంక్షలు.
జయ గారు! ధన్యవాదాలండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు
సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!!
మకర సంక్రాంతి శుభాకాంక్షలు.మీ పండుగ పోస్ట్ లు చాలా బాగున్నాయి. పండుగలా ఉన్నాయి.
సంక్రాంతి శుభాకాంక్షలు
వనజ వనమాలి గారు! ధన్యవాదాలు. మీకు హృదయ పూర్వక పండుగ శుభాకాంక్షలు!!
మాలా కుమార్ గారు! ధన్యవాదాలు. మీకు,
మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి
శుభాకాంక్షలు.
Post a Comment