”శోధిని”

Friday 13 January 2012

భోగి పండుగ శుభాకాంక్షలు!



సంక్రాంతి అనగానే రంగురంగుల  ముగ్గులు, గుమ్మడి పూలతో అలంకరించిన 
గొబ్బెమ్మలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల మేలగాళ్ళ సన్నాయి రాగాలు,
రకరకాల గాలిపటాలు గుర్తుకొస్తాయి.  సంక్రాంతి మూడు రోజులు ప్రతి ఇల్లు ముత్యాల 
ముగ్గులతో, పచ్చని తోరణాలతో కళకళ లాడుతూ ఉంటాయి.  కోడి పందాలు
ఎడ్ల పందాలు, ముగ్గులపోటీలు, గొబ్బెమ్మల పాటలతో గ్రామాలన్నీ సందడిగా 
ఉంటాయి.  దక్షణాయనం చివరి రోజున భోగి పండుగ జరుపుకుంటారు .   రోజున 
భోగి మంటలు వేసుకుని చలి పులిని పారద్రోలుతారు.  ఇంట్లో ఉన్న వ్యర్ధ సామానులన్నీ
భోగి మంటలో వేసి ఇంటిని శుభ్రపరుచుకోవడం ఆనవాయితి.  మన సంప్రదాయాన్ని,
తెలుగుదనాన్ని చాటిచెప్పే పండుగ భోగి పండుగ.  అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు!

5 comments:

రాజ్యలక్ష్మి.N said...

కాయల నాగేంద్ర గారూ ..
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా భోగిపండుగ శుభాకాంక్షలు

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు!మీకు కూడా భోగిపండుగ శుభాకాంక్షలు!!

కాయల నాగేంద్ర said...
This comment has been removed by the author.
Sai said...

మీకు కూడా భోగిపండుగ శుభాకాంక్షలు

కాయల నాగేంద్ర said...

సాయి గారు! మీ బ్లాగ్ 'నా మనసు' చూసాను. కంప్యూటర్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీకు తెలిసిన విషయాలు నలుగురితో పంచుకోవడం అభినందించతగ్గ విషయం. మీకు, మీ కుటుంబ సభ్యులకు సక్రాంతి శుభాకాంక్షలు.