”శోధిని”

Sunday 15 January 2012

జంటనగరాలు సగం ఖాళీ

నిత్యం ట్రాఫిక్ స్థంబనతో కిటకిటలాడే జంటనగరాలు సంక్రాంతి 
పుణ్యమా అని నగర రోడ్లన్నీ బోసిపోవడంతో వాహనాలన్నీ రివ్వున 
దుసుకుపోతున్నాయి.  ఇన్నాళ్ళు వాహనాల జోరు... ప్రమాదాలతో 
బేజారయిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.  ఎప్పుడూ నరకాన్ని 
చూపే ట్రాఫిక్ సమస్య ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.  సిటీ 
బస్సులు సైతం ప్రయాణికులు లేక ఖాళీగా తిరగడంతో వీటి సంఖ్య
కూడా తగ్గింది.   ప్రతిరోజూ రక్తంతో తన దాహం తీర్చుకునే 
రహదారులు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి.  ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడూ
ఇలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్లన్నీ ప్రశాంతంగా ఉంటే
బాగుంటుందనిపిస్తోంది. కానీ అలా జరగదని తెలుసు. ఎందుకంటే మళ్ళీ 
రేపటి నుంచి ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు 
షరా మామూలే!


2 comments:

శ్యామలీయం said...

జంటనగరాల్లో ఆట్టే మంది సీమాంధ్రులు లేరని కం.చం.రా గారూ తదితరులూ చేసిన వాదాన్ని ఒకసారి గుర్తుకు తెచుచ్చుకోవలసిన అవసరం ఉంది. నూటికి 90మంది తెలంగాణాస్వజనమే నిండి ఉన్నారు జంటనగరాల్లో అనే మాట నిజమైతే నగర రహదారులన్నీ యిలా బోసిపోవటానికి కారణం వారే సెలవివ్వాలి.

కాయల నాగేంద్ర said...

మీరు చెప్పింది నూటికి నూరుశాతం నిజం.