Thursday, 6 April 2017
Tuesday, 4 April 2017
Sunday, 2 April 2017
Tuesday, 28 March 2017
తెలుగు నూతన సంవత్సరానికి శుభోదయం !
ఋతువులలో ఎంతో సుందరమైనది వసంత రుతువు. ఈ ఋతువు వస్తూ... వస్తూ... తెలుగువారి నూతన సంవత్సరం 'ఉగాది'ని తెస్తుంది. ఆమని రాకతో ప్రకృతి పరవశిస్తుంది....పుడమి పులకించిపోతుంది. ప్రకృతి కాంత కొత్త రంగులు పులుముకొని నూతనత్వానికి నాంది పలుకుతుంది. హరిత వర్ణపు శోభతో... చిగురించిన లేత ఆకులతో... లోకమంతా పచ్చగా నవనవలాడుతూ కనపడుతుంది. వసంత ఋతువులో ప్రకృతి తన అందాన్ని చూసుకుని మురిసిపోతుంది. వేప పువ్వులు , మామిడి పువ్వులు, లేత చిగుళ్ళు , జాజి, మల్లెల సువాసనలతో పరిసరాలన్నీ ఘుమఘుమలాడుతూ శోభాయమానంగా కనిపిస్తాయి. లేత చిగుళ్ళు తింటూ మత్తుగా కూసే కోయిల పాట వినడానికి ఎంతో ఇంపుగా ఉంటుంది. కొత్త బెల్లం, కొత్త చింతపండు , మామిడి కాయలు , వేపపువ్వు, ఉప్పు, కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడి ఒక దివ్య ఔషదం. షడ్రుచులలాగే జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను, మంచిచెడులను దైర్యంగా ఎదుర్కొని జీవించడానికి సిద్దంగా ఉండాలని ఈ ఉగాది పచ్చడి అర్థం. తెలుగు ప్రజలంతా మన సంస్కృతీ సంప్రదాయాలతో ఆనందంగా జరుపుకునే పండుగ 'ఉగాది' పర్వదినం. తెలుగువారి నూతన సంవత్సరం ప్రతి మనిషిలోనూ నూతనత్వాన్ని నింపాలని మనసారా కోరుకుందాం.
Saturday, 25 March 2017
"మల్లెపూల మహత్యం"
వేసవికాలం వచ్చిందంటే చాలు మనసంతా మల్లెల పరిమళాలు గుభాలిస్తాయి. విచ్చుకున్న మల్లెలు ఇంటిని సుగంధాలతో నింపేస్తుంటాయి. ఆహ్లాదపరిచే మల్లెల సోయగాలు మనసును అలరిస్తాయి. మగువలు మెచ్చిన మల్లెలు మదిని మురిపిస్తాయి. మగువ సిగలో ఎన్ని రకాల పువ్వులు ఒదిగినా మల్లెపూల ముందు దిగదుడుపే. పరిమళానికి, సోయగానికి స్వచ్చమైన దవళకాంతులకు మారుపేరయిన మల్లెలు స్త్రీల సిగలో సహజ ఆభరణాలు. ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా, సాయంకాలం వేళ మల్లెలను చూడగానే రోజంతా పడిన కష్టం ఇట్టే మరచిపోతారు. సాయంత్రానికి వెండి వెన్నెల కురిపిస్తూ విరబూయటం వీటి ప్రత్యకత ! పరిమళానికి మారుపేరయిన పరిమలభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే ! ఈ పూల సుగందానికి పరవసించని మనసే ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు చల్లదనానికి, గుభాలింపులకు మారుపేరు మల్లెల సౌరవం జీవితాలనే మార్చేస్తుంది. శృంగారానికి, మల్లెపూలకు అవినాభావ సంబంధం ఉండటంతో మగవారికి కూడా ఈ సుగంధ మల్లెలంటే చాలా ఇష్టం. అందుకే శోభనం రాత్రికి ఈ పూలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇదీ మల్లెపూల మహత్యం.
Saturday, 18 March 2017
"కలిసుంటే కలదు సుఖం"
"హలో సార్" అంటూ ఎదురుగా వస్తున్న వారిని పలకరిస్తే ఆహ్లాదం మదిలో చిందులు వేస్తుంది. స్నేహ పుష్పం మొలకలేస్తుంది. ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు పంచుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటే ఎంత బాగుండు అని పిస్తుంది. కానీ, ఒక చోట నివసించేవారు అంటీ ముట్టనట్టు ఎడముఖం, పెడమొహంగా ఉంటే, అందరితో కలిసిపోవాలనుకునేవారికి కూడా చిరాకనిపిస్తుంది. ఇతరులతో మాకు సంబంధం ఏమిటనో తలుపులు మూసుకుని ఏకాంత జీవితానికి అలవాటయి పోతున్నారు. అలా ఉండటంలో ఆనందం ఏమిటో మరి వారికే తెలియాలి. ఒకరుకొకరు ఎదుటపడి కలుసుకున్నప్పుడు ఎదుటివారే పలకరించాలని, మనం పలకరిస్తే మన హోదా తగ్గుతుందనే సంకుచిత మనస్తత్వాలు కొందరివి. వీటన్నిటికీ కారణం అహం. అహం మనిషిని మృగంగా మారుస్తుంది. ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. అహం పెరిగితే బంధాలు విచ్చిన్నమైపోతాయి. ఒకరినొకరు
పట్టించుకోకుండా ప్రవర్తిస్తే, ఈర్ష్యాద్వేషాలు సంక్రమించి నిర్లిప్త స్వభావం ఏర్పడుతుంది. కూలి చేసుకునే పేదవారు కలసి మెలసి కులాసాగా జీవిస్తున్నారు. ఉన్నదాంట్లోనే తింటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. రక్తసంబంధం కాకపోయినా అన్నయ్య, అక్కయ్య అంటూ వరసలు కలుపుకొని కలుపుగోలుగా ఉంటారు. వారికి ఆస్తులు లేకపోయినా, అభిమానాలుంటాయి. సౌకర్యాలు లేకపోయినా సుఖముంటుంది. ఇంటికి తులుపులు లేకపోయినా కంటి నిండా నిద్ర పడుతుంది. ఆ పేదవారిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా వుంది.
పట్టించుకోకుండా ప్రవర్తిస్తే, ఈర్ష్యాద్వేషాలు సంక్రమించి నిర్లిప్త స్వభావం ఏర్పడుతుంది. కూలి చేసుకునే పేదవారు కలసి మెలసి కులాసాగా జీవిస్తున్నారు. ఉన్నదాంట్లోనే తింటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. రక్తసంబంధం కాకపోయినా అన్నయ్య, అక్కయ్య అంటూ వరసలు కలుపుకొని కలుపుగోలుగా ఉంటారు. వారికి ఆస్తులు లేకపోయినా, అభిమానాలుంటాయి. సౌకర్యాలు లేకపోయినా సుఖముంటుంది. ఇంటికి తులుపులు లేకపోయినా కంటి నిండా నిద్ర పడుతుంది. ఆ పేదవారిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా వుంది.
Sunday, 12 March 2017
Subscribe to:
Posts (Atom)






