వేసవికాలం వచ్చిందంటే చాలు మనసంతా మల్లెల పరిమళాలు గుభాలిస్తాయి. విచ్చుకున్న మల్లెలు ఇంటిని సుగంధాలతో నింపేస్తుంటాయి. ఆహ్లాదపరిచే మల్లెల సోయగాలు మనసును అలరిస్తాయి. మగువలు మెచ్చిన మల్లెలు మదిని మురిపిస్తాయి. మగువ సిగలో ఎన్ని రకాల పువ్వులు ఒదిగినా మల్లెపూల ముందు దిగదుడుపే. పరిమళానికి, సోయగానికి స్వచ్చమైన దవళకాంతులకు మారుపేరయిన మల్లెలు స్త్రీల సిగలో సహజ ఆభరణాలు. ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా, సాయంకాలం వేళ మల్లెలను చూడగానే రోజంతా పడిన కష్టం ఇట్టే మరచిపోతారు. సాయంత్రానికి వెండి వెన్నెల కురిపిస్తూ విరబూయటం వీటి ప్రత్యకత ! పరిమళానికి మారుపేరయిన పరిమలభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే ! ఈ పూల సుగందానికి పరవసించని మనసే ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు చల్లదనానికి, గుభాలింపులకు మారుపేరు మల్లెల సౌరవం జీవితాలనే మార్చేస్తుంది. శృంగారానికి, మల్లెపూలకు అవినాభావ సంబంధం ఉండటంతో మగవారికి కూడా ఈ సుగంధ మల్లెలంటే చాలా ఇష్టం. అందుకే శోభనం రాత్రికి ఈ పూలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇదీ మల్లెపూల మహత్యం.
No comments:
Post a Comment