Friday, 3 April 2015
Monday, 30 March 2015
Friday, 27 March 2015
రమణీయం ...శ్రీరామనామం !
తండ్రి మాటను నిలబెట్టడానికి తన జీవితాన్ని, యౌవనాన్ని అడవిపాలు
చేసుకున్న శ్రీరామచంద్రుడు ఎంతో మహాన్నతుడు. తల్లిదండ్రుల మాట జవదాటని తనయుడిగా, సత్యవాక్పరిపాలకుడిగా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ధర్మ ప్రభువుగా జీవించి, అందరి మన్నలను పొందాడు. తమ్ముళ్ళ పట్ల ప్రేమానురాగాలు, భర్యాభార్తల మధ్య ఉండవలసిన అనురాగం, అవగాహన, పిల్లల పట్ల తండ్రి బాధ్యత మొదలైనవన్నీ తాను ఆచరించి లోకానికి తెలియజెప్పిన ఆదర్శముర్తి శ్రీరాముడు. రమణీయమైన రామకథను ఎందరెందరో కవులు ఎన్నెన్నో భాషల్లో వ్రాసి చరితార్థులయ్యారు. కోదండరాముని కథని ఎన్నిమార్లు విన్నా, కన్నా, చదివినా తనివి తీరదు. రామబాణం రక్షిస్తుంది... రామహస్తం దీవిస్తుంది... రామ పాదం నడిపిస్తుంది...రామమంత్రం సుఖశాంతులను అందిస్తుంది.
" శ్రీరామ రామ రామేతి - రమే రామే మనోరమే !
సహస్ర నామ తత్తుల్యం - రామ నామ వరాననే !! "
లెజెండ్ - 365 రోజులు !
గత సంవత్సరం మార్చి 28న రిలీజ్ అయిన 'లెజెండ్' సినిమా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కడప జిల్లా ప్రొద్దుటూరు సెంటర్లలో ఈ సంవత్సరం మార్చి 28 నాటికి విజయవంతంగా 365 రోజుల పాటు ప్రదర్శించి రికార్డు సృష్టించింది. నేడు వస్తున్న సినిమాలు వారం రోజులు ఆడటమే కష్టతరం అయిన ఈ రోజుల్లో 'లెజెండ్' సినిమా సంవత్సరం పాటు విజయవంతంగా ఆడడం విశేషంగా చెప్పుకోవచ్చు.
Thursday, 26 March 2015
నవ్వితే నవ్వండి !
నవ్వడం వల్ల ముఖం వికసించి, మనసు ఉల్లాసం అవుతుంది. దాంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రింది జోక్ చదివి నవ్వు వస్తే నవ్వుకోండి.
"తలకి కట్టు కడుతూ ఎలా జరిగింది ?" అడిగాడు డాక్టర్.
"నిద్రలో కలవరించాను డాక్టర్" బాధగా చెప్పాడు.
"కలవరిస్తే ఇంత పెద్ద దెబ్బ తగిలిందా ?" ఆశ్చర్యంగా అడిగాడు.
"నేను పక్కనుండగా మరో ఆడదాని పేరు కలవరిస్తే తగలదా మరి ?" అసలు విషయం చెప్పింది సుబ్బారావు భార్య.
Wednesday, 25 March 2015
పవిత్ర గ్రంధాలు !
ప్రతి ఇంటా రామాయణం, మహాభాగవతం, భగవద్గీత ఈ మూడు పవిత్ర గ్రంధాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడు గ్రంధాలను అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే జీవితానికి ఒక మార్గం కనిపిస్తుంది. రామాయణం చదవడం వల్ల ఒక మనిషి ఎలా జీవించాలో, మంచి వ్యక్తిగా ఎలా మసలుకోవాలో తెలుస్తుంది. మహాభాగవతం చదవడం వల్ల భగవంతుడు ఎంతటి కరుణామయుడో, తన భక్తుల్ని ఆదుకునేందుకు ఎల్లవేళలా ఎలా వెన్నంటి ఉంటాడో అర్థమవుతుంది. గర్వం, అహాన్ని అణచివేసుకోవాలంటే భగవద్గీతను పారాయణ చేయాలి. అందుకే ముచ్చటగా ఈ మూడు గ్రంధాలను ఇంట్లో పెట్టుకుని, నిత్యం చదువుతూ ఉండటం ఎంతో అవసరం.
Tuesday, 24 March 2015
త్యాగమూర్తి !
ప్రకృతికి ప్రతీక ' స్త్రీ '! ఆమె ఇంట్లో స్త్రీ తిరుగుతుంటే ...ఆ ఇల్లు నందనవనంలా, పూజా మందిరంలా ఉంటుంది. అటువంటి ఇంట్లో ప్రేమ, వాత్సల్యం, త్యాగం, సేవకు కొదవ ఉండదు. తన వారి కోసం తపనతో, ఆత్రుతతో నిత్యం శ్రమిస్తూనే ఉంటుంది. ఉద్యోగం చేస్తూ, ఇల్లు సర్దుతూ, వంట చేస్తూ, పిల్లలను సముదాయిస్తూ అతిధుల్ని ఆదరిస్తూ, గౌరవించే త్యాగమూర్తి. అవసరమైతే ఎంతటివారినైనా ఎదురించగలదు.... తలచుకుంటే కత్తిపట్టి యుద్ధం చేయగలదు.
Subscribe to:
Posts (Atom)




