”శోధిని”

Saturday, 9 August 2014

అన్నా చెల్లెల అనుబంధం !


భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి.  ఈ రోజున సోదరి, సోదరుడికి కట్టే రక్షణ కవచం రాఖీ.  మహిళలకు రక్షణగా నిలవడడమే ఈ పండుగ ఉద్దేశం.  స్త్రీల పట్ల సోదరభావం, పవిత్రభావం ప్రతి ఒక్కరిలో కలగాలి. సమాజంలో తనకు పూర్తి రక్షణ ఉందన్న నమ్మకం ప్రతి మహిళలో కలిగించాలి.  అప్పుడే నిజమైన రక్షాబంధం.


Thursday, 7 August 2014

ప్రతి ఇంటా శ్రావణ శోభ !


     శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం మైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరించడం ఎంతో శుభకరమని  మన పురాణాలు చెబుతున్నాయి.  అంతేకాకుండా చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించే మాసం కావడంతో శ్రావణ మాసంగా పాచుర్యం పొందింది.  ఈ మాసం ముఖ్యంగా మహిళలకు ఎంతో సౌభాగ్యప్రదం. ఈ నెలంతా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయి. శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని  భక్తిశ్రద్దలతో నిండు మనసుతో  పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ వరలక్ష్మి వ్రతం మహిళలందరికీ మంగలప్రదమైనది...ఎంతో శుభదాయకమైనది. 

Tuesday, 5 August 2014

అమ్మంటే ...!



అమ్మంటే ...
ఒక  అద్భుతం 
ఒక  అనుభూతి 
ఒక  జ్ఞాపకం 
ఒక  వాస్తవం 
ఒక  ఆదర్శం 
భూత, వర్తమాన 
భవిష్యత్తు  కాలానికి 
ఓ  దర్పణం !


Saturday, 2 August 2014

స్వచ్చమైన స్నేహం!


మనసుకు శ్వాస లాంటిది 
తనువుకు ప్రాణం లాంటిది 
ఎటువంటి కల్మషం లేని
పసిపాప మనసు లాంటిది
స్వచ్చమైన  స్నేహం!



ఇద్దరు చంద్రులు కలిసిన శుభ వేళ !

రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ముఖ్యమంత్రుల హోదాలో తొలిసారిగా ఇద్దరు తెలుగుముఖ్యమంత్రులు చేతులు కలిపిన దృశ్యం !

Monday, 28 July 2014

పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు!


శుభాలు కురిపించే వారాల  మాసం రంజాన్.  ఈ పవిత్ర మాసం అత్యంత శుభప్రదమైనది.  ఎనలేని శుభాలను అందించే ఈ నెలంతా ముస్లిం సోదర సోదరీమణులలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది.  మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి జీవనసాఫల్యానికి కావాల్సిన అనేక విషయాలు ఈ మాసంతో ముడిపడి ఉన్నాయి.  అంతేకాకుండా ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించడంతో  ఈ పవిత్ర గ్రంధం సమస్త మానవాళికి మార్గదర్శిని అయ్యింది. అందుకే ఈ మాసమంతా ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్రం, పుణ్యదాయకం.   శుభాల సిరులు అందించే రంజాన్ పర్వదినం అందరికీ సకల శుభాలను, శోభలను అందించాలని మనసారా కోరుకుంటున్నాను.  
       మిత్రులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు!