”శోధిని”

Saturday, 21 December 2013

గవర్నమెంట్ సోమ్ము!


జైల్లో ఇద్దరు ఖైదీలు మాట్లాడుకుంటున్నారు-
"నా చిన్నప్పుడు నా జాతకం చూసిన జ్యోతిష్కుడు 'నువ్వు పెద్దయ్యాక గవర్నమెంట్ సోమ్ముతినే యోగం వుంది దొర' అంటే మా అమ్మా-నాన్న తెగ సంబరపడిపోయి  జ్యోతిష్కుడికి పెద్ద మొత్తంలో అప్పజెప్పారు.  చేయని నేరానికి ఇలా  జైల్లో ఖైదీనై గవర్నమెంట్ ఫుడ్ తినాల్సి వస్తుందని ఇప్పుడు అర్థమైంది.  తోటి ఖైదీ తో వాపోయాడు మరో ఖైదీ. 


Tuesday, 17 December 2013

తెలుగు సినిమా!



మన తెలుగు సినిమాలలో కథ అసలు ఉండదు.  కథ స్థానాన్ని బూతు సంభాషణలు, భయంకర వాయిద్యాలు, ఎబ్బెట్టు దుస్తులు, సాహిత్యం లేని పాటలు , భయంకర పోరాటాలు, రక్తపాతాలు ఆక్రమించుకున్నాయి. ఇలాంటి చెత్త సినిమాలు పట్టుమని పది రోజులు కుడా  ఆడవు.  ఇక హీరో విషయానికొస్తే, పాత సినిమాలలో హీరోను 'డైనమిక్' గా చూపించే వారు దర్శకులు.  కాని నేడు హీరో ని జులాయిలా... రౌడీ వెదవలా చూపిస్తున్నారు. హీరోయిళ్లు అయితే విచిత్రమైన దుస్తులలో అర్థనగ్నంగా కనిపించడానికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.  ఇలా  పనికిమాలిన సినిమాలు నిర్మించి పూర్తిగా తెలుగుదనానికి దూరమై పరాయి పంచన మోకరిల్లుతున్నారు. తెలుగు అందాలను వదలి పరాయి అందాలకు స్వాగతం పలుకుతున్నారు. మన సంస్కృతి  సంప్రదాయాలని ప్రతిబింబించే సినిమాలను నిర్మించడం మానేశారు.  హింస, శృంగారం, వెకిలి హాస్యం.. ఇవి ఉంటేనే తెలుగు సినిమా అనుకుంటూ, మన భాషను విస్మరిస్తున్నారు... మన సంస్కృతిని కాలరాస్తున్నారు... ఉన్నతమైన మన సంప్రదాయాలను తిలోదకాలిస్తున్నారు.  పేరుకు మాత్రమే తెలుగు సినిమా, కాని ఎక్కడా తెలుగు సంప్రదాయాలు గాని, ఆచారాలు గాని తెలుగు లోగిళ్ళు గాని వెండి తెర పైన కనిపించవు.  పరభాష మోజులో పడి, తెలుగుదనాన్ని సినిమాల్లో కనిపించకుండా సమాధి కట్టేశారు మన తెలుగు దర్శక నిర్మాతలు.  "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు" లాంటి చిత్రాలు ఎప్పుడో పుష్కరాని కొక్కటి వస్తుంది తప్ప, తర్వాత కాగడా పట్టి వెతికినా అలాంటి సినిమాలు మచ్చుకైనా కనిపించవు.   


Sunday, 15 December 2013

అల్లరి పిడుగు!

                                   
కొడుకు  :  మమ్మీ... నాదొక డౌట్?

తల్లి       :  'వెదవకన్నీ వీడి నాన్నపోలికలే' అని మనసులో అనుకుంటూ...  "అడుగు"  అంది.  

కొడుకు  :  ట్యూషన్  టీచర్ మొత్తం పాఠాలన్నీ  చెబుతుంది.  స్కూల్లో టీచర్స్  మాత్రం ఒకరు  ఒక పాఠం మాత్రమే   చేబుతారెందుకు? 

తల్లి      : "మీ నాన్న ఒక్క ఉద్యోగమే వెలగబెడుతుంటే... నేను మాత్రం ఇంట్లో బోలెడు పనులు చేయట్లా?"అదీ అంతే!

కొడుకు  : "ఓహో... నువ్వేమో  ట్యూషన్  టీచర్, నాన్నేమో స్కూల్ టీచర్  అన్నమాట" అన్నాడు అమాయకంగా. 

Friday, 13 December 2013

2013 సంవత్సరంలో "హిట్ అయిన తెలుగు సినిమాలు"

2013 సంవత్సరంలో "హిట్ అయిన పెద్ద సినిమాలు" 

1.     అత్తారింటికి దారేది 
2.     సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు 
3.     నాయక్ 
4.     మిర్చి 
5.     బలుపు 

2013 సంవత్సరంలో "హిట్ అయిన చిన్న సినిమాలు" 

1.     గుండే జారి గల్లంతయిందే 
2.     స్వామి రారా 
3.     ప్రేమకథా చిత్రం 
4.     తడాకా 
5.     వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ 
      
2013 సంవత్సరంలో "పర్వాలేదు అనిపించిన  సినిమాలు" 

1.     బాద్ షా  
2.     మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు 
3.     మసాలా 
4.     దూసుకెళ్తా  
5.     పోటుగాడు   

పంచ్ డయిలాగులు,  పవన్ స్టయిల్ తో వినోదాత్మకంగా వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం నెంబర్ 1 గా నిలిచింది. 

పచ్చని పల్లెటూరి అందాలతో, పల్లె ప్రజల ఆప్యాయతలు, అనురాగాలు ఎలా ఉంటాయో తెలిపే చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు"       

రామ్ చరణ్ నటించిన 'నాయక్' యాక్షన్ తో పాటు హాస్యరసం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

పగ, ప్రతీకారం, రౌడీయిజం, ఫ్యాక్షనిజం, వినోదం  ఇవన్నీ పుష్కలంగా ఉన్న సినిమా 'మిర్చి'   

రవితేజను ఎలా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి మాస్ సన్నివేశాలు నిండుగా వున్న చిత్రం 'బులుపు'

యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమా 'గుండే జారి గల్లంతయిందే'

'స్వామి రా రా' చిత్రం ప్రజెంటేషన్ బాగుండటంతో యుత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కుడా నచ్చింది. 

ప్రేమను వైవిధ్యంగా చూపించడంతో  'ప్రేమకథా చిత్రం'  విజయం సాధించింది. 

వినోదం తో పాటు యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకోవడంతో ' తడాకా' అందరికీ  నచ్చింది. 

అన్ని వర్గాల ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచిన చిత్రం ' వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'

ఇక పర్వాలేదు అనిపించే చిత్రాలు 'పర్వాలేదు' అనిపించాయి. 



Wednesday, 11 December 2013

ఇదొక సరదా!

కొత్త సెల్ కొందామని షాప్ కెళ్ళింది కామాక్షి.  ప్రతి సెల్ ను క్షుణ్ణంగా పరీక్షించింది.  ఏది నచ్చలేదు ఆమెకు, ముఖం అదోలా పెట్టింది. అది గమనించిన సేల్స్ మెన్... 
"ఈ సెల్ తీసుకోండి మేడం ... ఎందులో మీ పక్కింటి వాళ్ళ మాటలు వినే సదుపాయం కుడా వుంది " ఓ  సెల్ ను చూపిస్తూ చెప్పాడు. 
"ఇలాంటి  సెల్ కోసమే ఇన్నాళ్ళు  ఎదురు చూస్తున్నాను " మారు బేరం ఆడక్కుండానే (లేకుంటే సేల్స్ మెన్ ను ముప్పు తిప్పలు పెట్టేది) ఆతను చెప్పిన ధరకే తీసుకొని బైట పడింది కామాక్షి పక్కింటి మాటలు వినడానికి. 

      (ఇది సరదా కోసం రాసింది ... ఎవ్వరిని నొప్పించడానికి కాదని మనవి)

                                        11-12-13


Monday, 9 December 2013

పప్పులో కాలేసినట్లే!

 
'మన ఇల్లు పచ్చగా వుంటే చాలు.   మన చుట్టూవున్న వారితో, పరిసరాలతో మనకు పని లేదు'  అనుకునే వాళ్ళు చాలా మంది వున్నారు.  వీళ్ళు చదువుకోలేని అజ్ఞానులు అంటే అదీ కాదు. బాగా చదువుకున్నవాళ్ళే అధికం. మన ఇల్లు, గేటు వరకే మనదని, దాని తర్వాత ప్రాంతం మనవి కాదని మన ఇంట్లో చెత్త చెదారాన్ని అక్కడ పడేస్తే, క్రిమికీటకాలు చేరి మన ప్రక్కవాళ్ళతో పాటు మనల్ని కుట్టి రోగాలను పుట్టిస్తాయని తెలుసుకోలేని మార్ఖులు.   అంతేకాదు  అది చూసేవాళ్ళకి ఎంత అసహ్యంగా కనిపిస్తుందో ఆలోచించారు. మనం తిరిగే ప్రతీ ప్రాంతం మనదే అనుకుని పరిశుభ్రంగా వుంచడానికి ప్రయత్నించాలి. ఇవ్వన్నీ చేయాలంటే ముందు మన మనసులో ఎలాంటి మలినాలు లేకుండా పరిశుభ్రంగా వుంచుకోవాలి. అప్పుడే మన చుట్టూ వున్న పరిసరాల గురించి ఆలోచిస్తాం. మన చుట్టూ వున్నా పరిసరాలు కుడా మనవే అనే అభిప్రాయం అందరిలో కలగాలి. పరసరాలను కలుషితం చేస్తే ఈగలు, దోమలు, బొద్దింకలు చేరి మన ఇంట్లేకి రాక మానవు. మన పుణ్యమా అని ఇరుగు పొరుగు వాల్లకి చేరక మానవు. మన ఇల్లే శుభ్రంగా వుంచుకుని, మిగిలినది మనకి సంబంధం లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్లే!


Saturday, 7 December 2013

'ఆనందో బ్రహ్మ' హఠాన్మరణం



'ఆనందో బ్రహ్మ' సీరియల్ ద్వారా  పాపులర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతూ రాత్రి కన్నుమూయడంతో  తెలుగు సినీహస్య వినీలాకాశంలోంచి మరో తార రాలిపోయినట్లయింది.  దాదాపు వంద చిత్రాలు పైగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  ఆయన నటించిన తెలుగు సినిమాలలో ఒక లెక్చరర్ గా, అధ్యాపకుడిగా ప్రేక్షకులను తెగ నవ్వించిన పాత్రలు  ఎప్పటికీ గుర్తుండిపోతాయి.  ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు.  సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు  శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.