”శోధిని”

Friday, 13 January 2012

భోగి పండుగ శుభాకాంక్షలు!



సంక్రాంతి అనగానే రంగురంగుల  ముగ్గులు, గుమ్మడి పూలతో అలంకరించిన 
గొబ్బెమ్మలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల మేలగాళ్ళ సన్నాయి రాగాలు,
రకరకాల గాలిపటాలు గుర్తుకొస్తాయి.  సంక్రాంతి మూడు రోజులు ప్రతి ఇల్లు ముత్యాల 
ముగ్గులతో, పచ్చని తోరణాలతో కళకళ లాడుతూ ఉంటాయి.  కోడి పందాలు, 
ఎడ్ల పందాలు, ముగ్గులపోటీలు, గొబ్బెమ్మల పాటలతో గ్రామాలన్నీ సందడిగా 
ఉంటాయి.  దక్షణాయనం చివరి రోజున భోగి పండుగ జరుపుకుంటారు .  ఈ రోజున 
భోగి మంటలు వేసుకుని చలి పులిని పారద్రోలుతారు.  ఇంట్లో ఉన్న వ్యర్ధ సామానులన్నీ
భోగి మంటలో వేసి ఇంటిని శుభ్రపరుచుకోవడం ఆనవాయితి.  మన సంప్రదాయాన్ని,
తెలుగుదనాన్ని చాటిచెప్పే పండుగ భోగి పండుగ.  అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు!

Thursday, 5 January 2012

'శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని యువత చూడాలి


ఆంధ్రభూమి  వెన్నెల



మీవ్యూస్


కళాప్రపూర్ణ, చిత్రబ్రహ్మ బాపు దర్శకత్వంలో ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీరామరాజ్యం’. ఈ సినిమా పండితుల, పామరుల ప్రశంసలు అందుకుంటోంది. నేటి తరం, రేపటి తరం వారు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునేలా బాపుఅత్యంత సుందరంగా ఈ చిత్రాన్ని తెర కెక్కించారు. సీతారాముల మధ్య ఉండే ప్రేమానురాగాలు చిత్రీకరించిన తీరు చాలా బాగుంది. ప్రతి సన్నివేశంలో బాపుగారు కనిపిస్తే, ప్రతి మాటలోనూ శ్రీరమణగారు గుర్తుకువస్తారు. అదే విధంగా ఆర్ట్ డైరెక్టర్ పనితనం ప్రతి సెట్‌లోనూ కనబడుతుంది. అలాగే ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పాటలన్నీ వినసొంపుగా, సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని శ్రీరాముడి పాత్రను చక్కగా పోషించాడు. సీత పాత్రలో నయనతార వొదిగిపోయి నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పవచ్చు.

- కాయల నాగేంద్ర, హైదరాబాద్

Tuesday, 3 January 2012

మంచి మాటలు

1)  మంచివారి దగ్గర అహంభావం చూపొద్దు
     అహంకారులతో వనయంగా ఉండొద్దు.


2)  నువ్వు ఇష్టపడేవాళ్ళను కాదు,
     నిన్ను ఇష్టపడేవాళ్ళను ఇష్టపడు.


3)  ప్రతివిషయాన్ని స్పష్టంగా చూడగలిగేవాడు 'మేధావి'
     ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవాడు  చాలా 'ప్రమాదకారి'.


4)  'మంచిపనులు' గంధం కన్నా, మల్లెలకన్న మిన్నగా ఉంటాయి.


5)  'అసూయ' ద్వేషాన్ని రగుల్చుతుంది.  ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.


6)  తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాపడి క్షమించమని అడిగేవారు 
      'గుణవంతులు'.
7)  తాము ఏ తప్పు చేసినా తమదే పైచేయి అని వాదించేవారు 'మూర్ఖులు'.


8)  విజయం సాదించినవారు  పొంగి పోకూడదు
     విజయ రహష్యాలు నలుగురితో పంచుకోవాలి.


9)  ఓడిపోయినవారు కుంగిపోకూడదు
     ఓడిన కారణాలను విశ్లేషించుకోవాలి.


10) చిన్న నిప్పురవ్వ చాలు ఆస్తి బూడిద కావడానికి --
      చిన్న తప్పు చాలు మనిషి జీవితాన్ని మసి చేయడానికి 
                             
                                  * * * * * *



Saturday, 31 December 2011

ఆంగ్ల నూతన సంవత్సరానికి ఆహ్వానం!



పాత సంవత్సరానికి (2011) వీడ్కోలు చెబుతూ మనసునిండా కొత్త ఆలోచనలతో ఆంగ్ల నూతన సంవత్సరానికి (2012) ఆహ్వానం!  గత సంవత్సరంలో జరిగిన చెడును మరచి పోయి, మంచిని గుర్తుచేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో అడుగు పెడదాం.  ఈ నూతన సంవత్సరం బ్లాగ్ మిత్రులందరికీ సకల శుభాలు కలగాలని ఆశిస్తున్నాను.  మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర (2012) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!

Wednesday, 28 December 2011

నిషేధం కేసు వీగిపోయింది

జ్ఞానామృత సారం అయిన భగవద్గీతను  తీవ్రవాద సాహిత్యమని , రష్యాలో నిషేదించాలని
కొందరు రష్యన్లు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు
హింసను ప్రేరేపించలేదని, రాయబారానికి కౌరవులు అంగీకరించక పోవడంతో మరో గత్యంత
లేకనే పాండవులతో యుద్ధం చేయించాడన్న విషయాన్ని రష్యన్లు అపార్థం చేసుకున్నారు.
రష్యా కోర్టు భగవద్గీతను బాగా పరిశీలించి కేసును కొట్టివేసిందని తెలిసింది.  ఇది
భారత ప్రజల విజయం.  భగవద్గీత తీవ్రవాద సాహిత్యం కాదని, అదొక ఆధ్యాత్మిక మకరందమని,
మానవాళికి శాశ్వత మణిదీపం అని రష్యన్లు తెలుసుకుంటే మంచిది.


Saturday, 24 December 2011

'క్రిస్మన్' శుభాకాంక్షలు.

క్రిస్మస్ అటే దైవత్వం మానవత్వంలోకి ప్రవేసించిన రోజు. అందుకే ఈరోజు క్రైస్తవ సోదరసోదరీమణులు
భక్తితో పండుగ చేసుకుంటారు. అయితే విచిత్రమేమిటంటే ఈ పండుగలో ఏసుక్రీస్తు కంటే శాంటక్లాజ్,
క్రిస్మస్ ట్రీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండంతో అసలు సంగతి మరుగున పడిపోతోంది. ఏసుక్రీస్తుకి వేడుకలు,ఆర్భాటాలు అసలు నచ్చవు.
ఆయన ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని చెప్పాడు. అందుకే ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఈలోకంలోకి లోకరక్షకుడిగా వచ్చినందుకు ఏసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుని ఆరాదిస్తారు. అందుకే క్రిస్మస్ ను ఆరాధనాభావంతో చేసుకోవాలి. క్రిస్మస్ నాడు దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడాలి. ప్రభువైన ఏసుక్రీస్తు ఆర్భాటాలకోసంఈ లోకం రాలేదని, సత్యసువార్తను ప్రజలకు భోదించడానికి వచ్చాడని తెలుసుకోవాలి. " నీపట్ల నీవు ఎలా ప్రవర్తించుకుంటారో ఇతరుల పట్ల అలాగే వ్యవహరించు. పోరుగువారిని నీలాగా భావించి ప్రేమించు." ఇలాంటి వాక్యాలు కోకొల్లలు. హిందువులు 'శివరాత్రి'ని ఎంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారో, ముస్లీములు 'రంజాన్' ఎంత పవిత్రంగా చేసుకుంటారో అంతే భక్తి శ్రద్దలతో క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రైస్తవ సోదరసోదరీమణులకు 'క్రిస్మన్' శుభాకాంక్షలు.

Sunday, 18 December 2011

భగవద్గీత పైన నిషేధమా?


రష్యాలో భగవద్గీతను నిషేధించాలంటూ కొన్ని సంస్థలు
కోర్టుకి వెళ్ళడం భారతీయులందరినీ అవమానించడమే
అవుతుంది. ఈ దురదృష్టకరమైన వార్త హిందూ మనోభావాలను
దెబ్బతీస్తుంది.  భగవద్గీతను తీవ్రవాద సాహిత్యమంటున్నరష్యన్లు
నిజంగానే పిచ్చివాళ్ళు. ఈ దుశ్చర్యను ప్రతి భారత పౌరుడు  తీవ్రంగా
ఖండించాలి. మనదేశంలో పుట్టిన భగవద్గీతను నిషేధించడానికి
వాళ్ళెవరు?  వెంటనే మన భారత ప్రభుత్వం స్పందించి "భగవద్గీత
పవిత్రమైన గ్రంధం " అని దౌత్యపరంగా ఆ మూర్ఖులకు తెలియచెప్పాలి.