”శోధిని”

Wednesday 28 December 2011

నిషేధం కేసు వీగిపోయింది

జ్ఞానామృత సారం అయిన భగవద్గీతను  తీవ్రవాద సాహిత్యమని , రష్యాలో నిషేదించాలని
కొందరు రష్యన్లు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు
హింసను ప్రేరేపించలేదని, రాయబారానికి కౌరవులు అంగీకరించక పోవడంతో మరో గత్యంత
లేకనే పాండవులతో యుద్ధం చేయించాడన్న విషయాన్ని రష్యన్లు అపార్థం చేసుకున్నారు.
రష్యా కోర్టు భగవద్గీతను బాగా పరిశీలించి కేసును కొట్టివేసిందని తెలిసింది.  ఇది
భారత ప్రజల విజయం.  భగవద్గీత తీవ్రవాద సాహిత్యం కాదని, అదొక ఆధ్యాత్మిక మకరందమని,
మానవాళికి శాశ్వత మణిదీపం అని రష్యన్లు తెలుసుకుంటే మంచిది.


11 comments:

♛ ప్రిన్స్ ♛ said...

nice news

పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్క్రుతామ్
ధర్మ సంస్థాపన నార్ధాయ సంభవామి యుగే యుగే

దుష్క్రుతామ్ ఈ పదము సరి చేయగలరు

svk said...

ఆ గీత లొ పనికి వొచ్హెడి లెదు పనికి రానిడి లెదు, యెందుకు గొంతు చించుకొంతారu

కాయల నాగేంద్ర said...

svk గారు! మిమ్మల్ని ఒక బ్లాగ్ స్నేహితుడుగా గౌరవిస్తున్నాను.
మీరు నా బ్లాగ్ పైన వ్యాఖ్యలు రాసేటప్పుడు నా రచనలో తప్పులుంటే
చెప్పండి సరిదిద్దుకుంటాను. అంతేకాని 'యెందుకు గొంతు చించుకుంటారు'
లాంటి పదాలను దయచేసి వాడకండి. ఎందుకంటే ఇలాంటి పదాలు
చదవడానికి, వినడానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. గీతలో పనికోచ్చేదేంత ఉందొ
భారత ప్రజలందరికి తెలుసు.

Malakpet Rowdy said...

SVK,

తమరి కమ్యూనిష్టు చెత్త కన్నా గీత చాలా బెటర్.

Malakpet Rowdy said...
This comment has been removed by the author.
కాయల నాగేంద్ర said...

చాలా ఘాటయిన సమాధానం చెప్పారు. థ్యాంక్స్ !

Praveen Mandangi said...

నాగేంద్ర గారు, వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా కోర్ట్‌లు తీర్పులు చెప్పవు. బైబిల్ సృష్టివాదాన్ని పాఠ్య పుస్తకాలలో బోధించాలని కొన్ని దేశాలలో చర్చ్ అధికారులు కోర్ట్‌లో వేసిన కేసుల్ని కూడా కోర్ట్‌లు కొట్టివేశాయి. ఈ విషయంలోనైనా కోర్ట్ తీర్పు ఏమైనా విచిత్రమా? ఇదేదో హిందువుల విజయమైనట్టు గొప్పగా చెప్పుకోవడం ఎందుకు?

SHANKAR.S said...

svk గారూ ఇక్కడ గీత అంటే మీ మాజీ గర్ల్ ఫ్రెండో ఇంకోరో కాదండీ (అది మీ పర్సనల్ విషయం కదా ఇక్కడ వాళ్ళ గురించి మీరు మాట్లాడితే బాగోదు). ఇక్కడ నాగేంద్ర గారు చెప్తున్నది భారతీయులందరూ గౌరవించే భగవద్గీత గురించి.మీకు సరిగ్గా అర్థమయినట్టు లేదు. అంతేనా?

Bhardwaj Velamakanni said...

Shankar ...

LOOOOOOOOOOOOOOL :))

కాయల నాగేంద్ర said...

'ఇది భారత ప్రజల విజయం' అన్నాను. మీరన్నట్టు
'హిందువుల విజయం'అని రాయలేదు. దయచేసి
లేనిదానిని కల్పించవద్దు.

Praveen Mandangi said...

భారత ప్రజల విజయం కూడా అవ్వదు. ఎందుకంటే కోర్ట్‌లు వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా తీర్పులు చెప్పవు కదా.