”శోధిని”

Tuesday, 3 January 2012

మంచి మాటలు

1)  మంచివారి దగ్గర అహంభావం చూపొద్దు
     అహంకారులతో వనయంగా ఉండొద్దు.


2)  నువ్వు ఇష్టపడేవాళ్ళను కాదు,
     నిన్ను ఇష్టపడేవాళ్ళను ఇష్టపడు.


3)  ప్రతివిషయాన్ని స్పష్టంగా చూడగలిగేవాడు 'మేధావి'
     ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవాడు  చాలా 'ప్రమాదకారి'.


4)  'మంచిపనులు' గంధం కన్నా, మల్లెలకన్న మిన్నగా ఉంటాయి.


5)  'అసూయ' ద్వేషాన్ని రగుల్చుతుంది.  ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.


6)  తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాపడి క్షమించమని అడిగేవారు 
      'గుణవంతులు'.
7)  తాము ఏ తప్పు చేసినా తమదే పైచేయి అని వాదించేవారు 'మూర్ఖులు'.


8)  విజయం సాదించినవారు  పొంగి పోకూడదు
     విజయ రహష్యాలు నలుగురితో పంచుకోవాలి.


9)  ఓడిపోయినవారు కుంగిపోకూడదు
     ఓడిన కారణాలను విశ్లేషించుకోవాలి.


10) చిన్న నిప్పురవ్వ చాలు ఆస్తి బూడిద కావడానికి --
      చిన్న తప్పు చాలు మనిషి జీవితాన్ని మసి చేయడానికి 
                             
                                  * * * * * *



Saturday, 31 December 2011

ఆంగ్ల నూతన సంవత్సరానికి ఆహ్వానం!



పాత సంవత్సరానికి (2011) వీడ్కోలు చెబుతూ మనసునిండా కొత్త ఆలోచనలతో ఆంగ్ల నూతన సంవత్సరానికి (2012) ఆహ్వానం!  గత సంవత్సరంలో జరిగిన చెడును మరచి పోయి, మంచిని గుర్తుచేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో అడుగు పెడదాం.   నూతన సంవత్సరం బ్లాగ్ మిత్రులందరికీ సకల శుభాలు కలగాలని ఆశిస్తున్నాను.  మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర (2012) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!

Wednesday, 28 December 2011

నిషేధం కేసు వీగిపోయింది

జ్ఞానామృత సారం అయిన భగవద్గీతను  తీవ్రవాద సాహిత్యమని , రష్యాలో నిషేదించాలని
కొందరు రష్యన్లు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు
హింసను ప్రేరేపించలేదని, రాయబారానికి కౌరవులు అంగీకరించక పోవడంతో మరో గత్యంత
లేకనే పాండవులతో యుద్ధం చేయించాడన్న విషయాన్ని రష్యన్లు అపార్థం చేసుకున్నారు.
రష్యా కోర్టు భగవద్గీతను బాగా పరిశీలించి కేసును కొట్టివేసిందని తెలిసింది.  ఇది
భారత ప్రజల విజయం.  భగవద్గీత తీవ్రవాద సాహిత్యం కాదని, అదొక ఆధ్యాత్మిక మకరందమని,
మానవాళికి శాశ్వత మణిదీపం అని రష్యన్లు తెలుసుకుంటే మంచిది.


Saturday, 24 December 2011

'క్రిస్మన్' శుభాకాంక్షలు.

క్రిస్మస్ అటే దైవత్వం మానవత్వంలోకి ప్రవేసించిన రోజు. అందుకే ఈరోజు క్రైస్తవ సోదరసోదరీమణులు
భక్తితో పండుగ చేసుకుంటారు. అయితే విచిత్రమేమిటంటే ఈ పండుగలో ఏసుక్రీస్తు కంటే శాంటక్లాజ్,
క్రిస్మస్ ట్రీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండంతో అసలు సంగతి మరుగున పడిపోతోంది. ఏసుక్రీస్తుకి వేడుకలు,ఆర్భాటాలు అసలు నచ్చవు.
ఆయన ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని చెప్పాడు. అందుకే ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఈలోకంలోకి లోకరక్షకుడిగా వచ్చినందుకు ఏసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుని ఆరాదిస్తారు. అందుకే క్రిస్మస్ ను ఆరాధనాభావంతో చేసుకోవాలి. క్రిస్మస్ నాడు దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడాలి. ప్రభువైన ఏసుక్రీస్తు ఆర్భాటాలకోసంఈ లోకం రాలేదని, సత్యసువార్తను ప్రజలకు భోదించడానికి వచ్చాడని తెలుసుకోవాలి. " నీపట్ల నీవు ఎలా ప్రవర్తించుకుంటారో ఇతరుల పట్ల అలాగే వ్యవహరించు. పోరుగువారిని నీలాగా భావించి ప్రేమించు." ఇలాంటి వాక్యాలు కోకొల్లలు. హిందువులు 'శివరాత్రి'ని ఎంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారో, ముస్లీములు 'రంజాన్' ఎంత పవిత్రంగా చేసుకుంటారో అంతే భక్తి శ్రద్దలతో క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రైస్తవ సోదరసోదరీమణులకు 'క్రిస్మన్' శుభాకాంక్షలు.

Sunday, 18 December 2011

భగవద్గీత పైన నిషేధమా?


రష్యాలో భగవద్గీతను నిషేధించాలంటూ కొన్ని సంస్థలు
కోర్టుకి వెళ్ళడం భారతీయులందరినీ అవమానించడమే
అవుతుంది. ఈ దురదృష్టకరమైన వార్త హిందూ మనోభావాలను
దెబ్బతీస్తుంది.  భగవద్గీతను తీవ్రవాద సాహిత్యమంటున్నరష్యన్లు
నిజంగానే పిచ్చివాళ్ళు. ఈ దుశ్చర్యను ప్రతి భారత పౌరుడు  తీవ్రంగా
ఖండించాలి. మనదేశంలో పుట్టిన భగవద్గీతను నిషేధించడానికి
వాళ్ళెవరు?  వెంటనే మన భారత ప్రభుత్వం స్పందించి "భగవద్గీత
పవిత్రమైన గ్రంధం " అని దౌత్యపరంగా ఆ మూర్ఖులకు తెలియచెప్పాలి.

Sunday, 11 December 2011

బ్లాగర్లందరికీ అభినందనలు.

బ్లాగుల దినోత్సవం సందర్భంగా శ్రీ వీవెస్ గారి ఆధ్వర్యంలో ఆదివారం 
(11-12-11) నాడు జరిగిన సమావేశానికి దాదాపు పాతికమంది బ్లాగర్లు 
పాల్గొన్నారు.  కాని ఈ సమావేశంలో స్త్రీ బ్లాగర్లు లేని కొరత కొట్టొచ్చినట్లు
కనబడింది. కేవలం  ఇద్దరు స్త్రీ బ్లాగర్లు మాత్రమే హాజరయ్యారు. దాదాపు 
మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశం చాలా సరదాగా నడిచింది.
హాజరయిన బ్లాగర్లందరూ సభ చివరి వరకు  ఎంతో ఉల్లాసంగా గడిపారు. 
సభ నిర్వాహకులు శ్రీ కశ్యప్ గారు "చాయ్...చాయ్ ..." అంటూ అందరిని 
నవ్వించారు. శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు గారు ఈ సమావేశంలో ప్రత్యేక
ఆకర్షణగా నిలిచారు. సభ్యుల చిరునామాలు నమోదు చేయడం,  ప్రతి 
బ్లాగర్ని పలుకరించి ఫోటోలు తీయడం చూస్తుంటే తెలుగు బ్లాగర్ల పైన 
ఆయనకు ఎంత అభిమానంముందో అర్థమవుతుంది.  మార్కాపురం 
నుంచి విచ్చేసిన శ్రీ రవిశేఖర్ రెడ్డి గారు బ్లాగర్లందరికి ఉపయోగపడే 
మఖ్య విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమతి అపర్ణ గారు తన బ్లాగ్
గురించి, శ్రీ పంతుల గోపాలకృష్ణ  గారు తన బ్లాగ్ "అపురూపం" గురించి 
ఇలా సమావేశానికి హాజరయిన బ్లాగర్లందరూ తమ తమ బ్లాగర్ల గురించి 
వివరించారు.  తెలుగు బ్లాగుల దినోత్సవాన్ని విజయవంతం చేసిన 
బ్లాగర్లందరికీ పేరు పేరున అభినందనలు.

Saturday, 10 December 2011

తెలుగు బ్లాగుల దినోత్సవం

నేడు ( డిసెంబర్ 11 ) తెలుగు బ్లాగుల దినోత్సవం 
సందర్భంగా తెలుగు బ్లాగు మిత్రులందరికీ శుభాకాంక్షలు!