బ్లాగుల దినోత్సవం సందర్భంగా శ్రీ వీవెస్ గారి ఆధ్వర్యంలో ఆదివారం
(11-12-11) నాడు జరిగిన సమావేశానికి దాదాపు పాతికమంది బ్లాగర్లు
పాల్గొన్నారు. కాని ఈ సమావేశంలో స్త్రీ బ్లాగర్లు లేని కొరత కొట్టొచ్చినట్లు
కనబడింది. కేవలం ఇద్దరు స్త్రీ బ్లాగర్లు మాత్రమే హాజరయ్యారు. దాదాపు
మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశం చాలా సరదాగా నడిచింది.
హాజరయిన బ్లాగర్లందరూ సభ చివరి వరకు ఎంతో ఉల్లాసంగా గడిపారు.
సభ నిర్వాహకులు శ్రీ కశ్యప్ గారు "చాయ్...చాయ్ ..." అంటూ అందరిని
నవ్వించారు. శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు గారు ఈ సమావేశంలో ప్రత్యేక
ఆకర్షణగా నిలిచారు. సభ్యుల చిరునామాలు నమోదు చేయడం, ప్రతి
బ్లాగర్ని పలుకరించి ఫోటోలు తీయడం చూస్తుంటే తెలుగు బ్లాగర్ల పైన
ఆయనకు ఎంత అభిమానంముందో అర్థమవుతుంది. మార్కాపురం
నుంచి విచ్చేసిన శ్రీ రవిశేఖర్ రెడ్డి గారు బ్లాగర్లందరికి ఉపయోగపడే
మఖ్య విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమతి అపర్ణ గారు తన బ్లాగ్
గురించి, శ్రీ పంతుల గోపాలకృష్ణ గారు తన బ్లాగ్ "అపురూపం" గురించి
ఇలా సమావేశానికి హాజరయిన బ్లాగర్లందరూ తమ తమ బ్లాగర్ల గురించి
వివరించారు. తెలుగు బ్లాగుల దినోత్సవాన్ని విజయవంతం చేసిన
బ్లాగర్లందరికీ పేరు పేరున అభినందనలు.

4 comments:
నిన్న బ్లాగర్ల సమావేశంలో మనం కలుసుకోవడం వల్ల మీబ్లాగు సంగతి తెలిసింది. సమావేశంలో చెప్పినట్లు అందరి బ్లాగుల వివరాలూ మెయిల్ ద్వారాకాని కబుర్లు బ్లాగు ద్వారా కాని అందరికీ తెలియజేస్తే వారందరి బ్లాగులూ చూసే అవకాశం కలుగుతుంది.వెంటనే పోస్ట్ పెట్టినందుకు కృతజ్ఞతలు.
హైదరాబాద్ రావాలని అనుకున్నాను కానీ మొన్న ఉదయం 8:00కే ఆముదాలవలస రిజర్వేషన్ కౌంటర్‌లో తత్కాల్ పాసింజర్లతోనే పెద్ద క్యూ ఏర్పడింది. అందుకే నిన్న నేను రాలేదు.
శ్రీ పంతుల గోపాలకృష్ణ గారు! మీ అభిమానానికి ధన్యవాదాలు.
మీరు చెప్పినట్టు సమావేశానికి వచ్చిన వారందరి ఈ మెయిల్స్
పంపితే బాగుంటుంది. పోస్ట్ చేసేందుకు వీలుంటుంది.
శ్రీ ప్రవీణ్ శర్మ గారు! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీ బాధను
బ్లాగర్లందరూ అర్థం చేసుకుంటారు. ఈ సారి జరిగే సమావేశంలో
బ్లాగర్లతో మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు.
Post a Comment