జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో జరుపుకునే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం. ఇది ఎందరో వీరుల పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలం. తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడి మన దేశానికి విముక్తి లభించిన రోజు.... 'ఆగస్టు 15' మన దేశ చరిత్రలో మరచిపోలేని ఒక అపురూపమైన రోజు. ఈ సందర్భంగా మనకు స్వేఛ్ఛావాయువులు అందించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు !
Tuesday, 14 August 2018
Monday, 13 August 2018
అయిదో జ్యోతిర్లింగం
కేదారేశ్వరలింగం భూమికి పదకొండువేల అయిదు వందల అడుగుల ఎత్తులో ఉన్న కేదారేశ్వర లింగం హిమాలయపర్వతంపై ఉంది. ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారట. ఉత్తరదిక్కున ఎత్తయిన మంచుకొండల్లో ప్రత్యేక జ్యోతిర్లింగ క్షేత్రం ఈ కేదారేశ్వర జ్యోర్లింగం. ఇక్కడ ఋషులందరూ స్వామిని దర్శిస్తూ ఉంటారు. దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వారు సేవిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి వరకు ఆరు నెలలు మాత్రమే ఈ దేవాలయం తెరచియుండి భక్తులకు దర్శనం కలుగుతుంది. దీపావళి రోజున స్వామికి నేతితో దివ్యజ్యోతి వెలిగించి మూసిన దేవాలయం తలుపులు వైశాఖ శుద్ధ పాడ్యమినాడు తెరిచేనాటికి ఆరు నెలల క్రితం వెలిగించిన దీపం యథాతథంగా వెలుగుతూ దర్శనమిస్తుంది.
Sunday, 5 August 2018
నాలుగో జ్యోతిర్లింగం
ఓంకారేశ్వర క్షేత్రం మధ్యప్రదేశ్ లో ఉంది. ఈ క్షేత్రం వింధ్య పర్వతశ్రేణుల్లో నర్మదా కావేరి నదుల మధ్య ఉంది. సూర్యవంశరాజు మాంధాత అడవికి వెళ్ళినప్పుడు ధూపదీపనైవేద్యాలు లేని శివలింగం కనబడిందట. ఆ శివలింగంలోంచి ఓంకారం వినబడుతుంది గ్రహించాడు. ఆయన పెద్దలను తీసుకొచ్చి చూపించాడట. పెద్దలు చూసి 'ఓంకారేశ్వరుడని' పేరు పెట్టారని చెబుతారు. అన్ని మంత్రాలకు, శబ్దాలకు మూలం ఓంకారం. అది నిత్యనూతనం. ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వల్ల ప్రణవనాద అనుసంధానంతో ఏకాగ్రత లభిస్తుందంటారు.
Sunday, 29 July 2018
మూడో జ్యోర్లింగం
ఉజ్జయిని మహాకాళేశ్వరలింగంగా ప్రసిద్ధమైనది మూడో జ్యోర్లింగం. ఈనాటి ఉజ్జయిని ప్రాచీన నామం అవంతి. మహాభక్తుడైన మార్కOడేయుణ్ణి రక్షించడానికి కాలుడైన యముణ్ణి సంహరించిన శివుడు ఇక్కడ మహాకాళుడు అయినాడట. కాశి దాసాది మహాకవులు, ఆదిశంకరుల వంటి ఆచార్యులు స్వామి అనుగ్రహాన్ని పొందిన ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లో ఉంది. ఈ క్షేత్రంలో స్వామి ముక్తిప్రదుడు. అకాలమృత్యువు నుండి రక్షిస్తాడట.
Saturday, 28 July 2018
నేడు లష్కర్ ( సికింద్రాబాద్ ) బోనాల జాతర
జంటనగరాలలో బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభంకావడంతో ఎటుచూసినా ఆధ్యాత్మికశోభ వెళ్లివిరుస్తోంది. తొలిజాతర గోల్కొండలో సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇప్పుడు రెండో జాతర 'లష్కర్ బోనాల జాతర' ప్రారంభమైనది. శివతత్తుల శివాలు, డప్పువాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపులు, దేవతామూర్తుల వేషధారణలతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నారు. ఈ నెలంతా అమ్మవారి దేవాలయాలన్నీ శోభాయమానంగా అలంకరిస్తారు. అడుగడుగునా భక్తజనం ఆనందపారవశ్యంతో మునిగితేలుతుంది. ఆషాఢమాసంలో మహంకాళి అమ్మవారిని గ్రామదేవతలుగా ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ, అని అనేక పేర్లతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారికి తోడుగా గ్రామాన్ని కాపాడే పోతరాజు కూడా ఈ పూజలు అందుకోవడం విశేషం.
Sunday, 22 July 2018
రెండవ జ్యోతిర్లింగం ‘మల్లికార్జున మహాలింగం’
మల్లికార్జున మహాలింగం నవ్యాంద్రప్రదేశ్
లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉంది. ‘శ్రీశైలం’
భూమికి కేంద్రబిందువుగా సంకల్పం చెప్పుకుంటాం.
మల్లికార్జున మహాలింగ దర్శనం
సర్వపాపాలను పోగొడతాయంటారు. అంతేకాదు
శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ కూడా ఉండదంటారు. చంద్రావతి అనే భక్తురాలు శ్రీపర్వతంపై తపస్సు
చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం
కోరుకోమన్నాడట. తాను అల్లిన మల్లెపూలదండను
శిరస్సున గంగలాగ ధరించమని కోరిందట. అందుకు
శివుడు అంగీకరించి మల్లెపూలదండను శిరస్సుపై ధరించి మల్లికార్జునుడు అయినాడు. భ్రమరాంబ సమేతుడై లోకరక్షణ చేస్తున్నాడు.
Friday, 20 July 2018
తులసి మంచి ఔషదం
మనం పవిత్రంగా భావించి పూజించే తులసి చెట్టులో ఎన్నో ఔషద గుణాలు దాగి ఉన్నాయి. తులసిని ఎలా తీసుకున్నా శరీరం మీద, మనసుమీద మంచి ఫలితాలను చూపిస్తుంది. గొంతు, నరాలు, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులలో తులసి మంచి ఫలితాలనిస్తుంది. రామతులసి, లక్ష్మితులసి, కృష్ణతులసి ఇలా పేర్లు వేరైనా అన్నీ తులసి మొక్కలలో ఒకే రకమైన ఔషద గుణాలుంటాయి. ఆరోగ్యపరంగా, ఆద్యాత్మికంగా తులసి మను ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం తులసిని వాడండి...ఆరోగ్యంగా ఉండండి.
Subscribe to:
Posts (Atom)







