”శోధిని”

Sunday 22 July 2018

రెండవ జ్యోతిర్లింగం ‘మల్లికార్జున మహాలింగం’



మల్లికార్జున మహాలింగం నవ్యాంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉంది.  ‘శ్రీశైలం’ భూమికి కేంద్రబిందువుగా సంకల్పం చెప్పుకుంటాం.  మల్లికార్జున మహాలింగ దర్శనం  సర్వపాపాలను పోగొడతాయంటారు.  అంతేకాదు శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ కూడా ఉండదంటారు.  చంద్రావతి అనే భక్తురాలు శ్రీపర్వతంపై తపస్సు చేసింది.  పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడట.  తాను అల్లిన మల్లెపూలదండను శిరస్సున గంగలాగ ధరించమని కోరిందట.  అందుకు శివుడు అంగీకరించి మల్లెపూలదండను శిరస్సుపై ధరించి మల్లికార్జునుడు అయినాడు.  భ్రమరాంబ సమేతుడై లోకరక్షణ చేస్తున్నాడు. 


No comments: