కేదారేశ్వరలింగం భూమికి పదకొండువేల అయిదు వందల అడుగుల ఎత్తులో ఉన్న కేదారేశ్వర లింగం హిమాలయపర్వతంపై ఉంది. ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారట. ఉత్తరదిక్కున ఎత్తయిన మంచుకొండల్లో ప్రత్యేక జ్యోతిర్లింగ క్షేత్రం ఈ కేదారేశ్వర జ్యోర్లింగం. ఇక్కడ ఋషులందరూ స్వామిని దర్శిస్తూ ఉంటారు. దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వారు సేవిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి వరకు ఆరు నెలలు మాత్రమే ఈ దేవాలయం తెరచియుండి భక్తులకు దర్శనం కలుగుతుంది. దీపావళి రోజున స్వామికి నేతితో దివ్యజ్యోతి వెలిగించి మూసిన దేవాలయం తలుపులు వైశాఖ శుద్ధ పాడ్యమినాడు తెరిచేనాటికి ఆరు నెలల క్రితం వెలిగించిన దీపం యథాతథంగా వెలుగుతూ దర్శనమిస్తుంది.
No comments:
Post a Comment