మహిళామణులకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. ఈ మాసంలో మంగళ, శుక్రవారాల్లో పసుపు, కుంకుమ, పువ్వులు, దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శ్రావణమాసంలో ప్రతి రోజూ పవిత్రమేనదే. ముఖ్యంగా సోమవారాలు అభిషేక ప్రియుడయిన పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా మంగళవారాలు గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తిశ్రద్దలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. వృద్ధిని, సంపదని, ఆయురారోగ్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించి ఆతల్లి అనుగ్రహం పొందుదాం.
Saturday, 22 August 2015
Thursday, 20 August 2015
మా పనిమనిషి ! (జోక్ )
"నువ్వెప్పుడూ సాహితీ సమావేశాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతావ్ .... ఇంట్లో పని మనిషిని మాన్పించావ్.... ఇల్లు చూస్తే చాలా శుభ్రంగా ఉంటుంది. ఇది ఎలా సాధ్యం ?" గాయత్రిని అడిగింది ఆశ్చర్యంగా తన స్నేహితురాలు.
"పని మనిషి లేదన్నాను కాని, మా వారు లేరని చెప్పలేదుగా !" అంది విలాసంగా కాళ్ళు ఊపుతూ
"అంటే మీవారిచేత ఇంటి పని చేయిస్తున్నావా ?""చేయిస్తే తప్పేమిటి? పది లక్షలు కట్నం ఇచ్చి కొన్నాను ...అందుకే ఇంటిపని, వంటపని, తోటపని చేయాలి తప్పదు."
"నా కళ్ళు తెరిపించావు ... వెంటనే మా పనిమషిని కూడా మాన్పించాలి" అంటూ హడావుడిగా ఇంటికి బయలు దేరింది గాయత్రి స్నేహితురాలు.
Wednesday, 19 August 2015
అవినీతి జలగలు !
ప్రభుత్వ ఉద్యోగాలు
పని తక్కువ
పరిహారం ఎక్కువ
లక్షల్లో జీతాలు
అయినా లంచాలు
ప్రతి ఆఫీసుల్లోనూ
అవినీతి జలగలే !
ప్రభుత్వాలు మారినా
మారని చేతివాటాలు !!
పని తక్కువ
పరిహారం ఎక్కువ
లక్షల్లో జీతాలు
అయినా లంచాలు
ప్రతి ఆఫీసుల్లోనూ
అవినీతి జలగలే !
ప్రభుత్వాలు మారినా
మారని చేతివాటాలు !!
Tuesday, 18 August 2015
ఇది మా ఆచారం ! ( జోక్ )
ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ జరుగుతోంది. బయట బందువులందరూ భాధను దిగమింగుతూ... ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. ఇంతలో నర్స్ పెద్ద పూలదండతో ఆపరేషన్ థియేటర్ లో వెళుతుంటే, పేషెంట్ బంధువులకు అనుమానం వచ్చి... "పూలదండ ఎందుకండీ " ఆతృతగా అడిగారు.
"డాక్టర్ గారు తొలిసారిగా ఆపరేషన్ చేస్తున్నాడు. విజయవంతమైతే డాక్టర్ గారికి వేసి అభినందనలు చెబుతాం. ఫెయిలయితే పేషెంట్ మెడలో వేసి సానుభూతి వ్యక్తపరుస్తాం. ఇది మా ఆసుపత్రి ఆచారం."
Monday, 17 August 2015
Sunday, 16 August 2015
అనాధుల పాలిట ఆపద్భాందవులు !
కనిపెంచిన తల్లిదండ్రులను నిర్ధాక్షిణంగా ఇంటినుంచి తరిమేస్తున్న కొడుకులు కొందరైతే, కన్నపేగును తెంచుకొని పుట్టిన బిడ్డల్ని అనాధలుగా రోడ్డుపై వదిలేస్తున్న తల్లిదండ్రులు మరికొందరు. ఇతర
ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి పట్టణాలలో వదిలేసేవారు ఇంకొందరు. ఇలా తమ పేగుబంధాన్ని దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో అనాధుల పాలిట ఆపద్భాందవులు, మానవత్వం ఉన్న మనుష్యులు ఇంకా ఉన్నారని 'ఆపన్న హస్తాలు' ముఖపుస్తకం ద్వారా కొందరు మిత్రులు తెలియజేస్తున్నారు. ప్రతి నెలా తమ సంపాదనలో కొంత డబ్బు కనీసం వంద రూపాయలు తగ్గకుండా అనాధుల కోసం కేటాయిస్తూ ఉడతాభక్తితో సమర్పించుకుంటున్నారు. వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
Friday, 14 August 2015
Subscribe to:
Posts (Atom)




