”శోధిని”

Monday, 13 July 2015

నీ కోపమే ..నీకు శత్రువు !

 

కోపం నిప్పులాంటిది.  దాన్ని అదుపులో ఉంచుకోకపోతే విచక్షనాజ్ఞానం కోల్పోయి, మానవత్వాన్ని మరచిపోతారు.  అందుకే మనిషికి అహంకారం, కోపం పనికిరాదు.  నేను చెప్పేదే వేదమని, నా మాటే వినాలనే అహంతో మూర్ఖుడిగా విర్రవీగితే,  చివరికి సమాజంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు.

Saturday, 11 July 2015

దేవాలయం ...శోభాయమానం !

దేవాలయం అతి పవిత్రమైనది.  ఆ పవిత్ర స్థలంలో చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, గాలి  అన్నీ అత్యంత పవిత్రమైనవే!  అక్కడ ఉన్నంత సేపు మనసు ప్రశాంతతను పొందుతుంది.  బాహ్యప్రపంచాన్ని వీడి, ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించి మధురమైన అనుభూతిని పొందుతాం.  అక్కడ పవిత్రమైన ఆలోచనలతో ఉంటే,  మనలో ఉండే అన్ని రుగ్మతలు తొలగిపోతాయి.

Tuesday, 30 June 2015

తులసి


భారతీయ సంస్కృతిలో  తులసికి ప్రత్యేకస్థానం ఉంది.  హిందువులు తులసిని పరమ పవిత్రంగా భావిస్తారు.  అంతేకాదు ఆరోగ్యప్రదాయని.... చక్కని ఔషదం కూడా.  అది ఎన్నోమొండి  రోగాలను నయం చేస్తుంది.  రోజూ కొన్ని ఆకులు నమిలి మింగితే  వ్యాధుల దరిచేరవంటారు.  మనవ శరీరంలో శ్లేష్మం పెరిగి శ్వాస ఆడక ప్రాణం పోతుంటే, తులసి తీర్థం తగిలి శ్లేష్మం విరిగి మనిషి బ్రతికిన సందర్భాలున్నాయి. అందుకే మనిషి తుదిశ్వాస విడిచేటప్పుడు తులసి తీర్థం గొంతులో పోస్తారు.  ఇంత పవిత్రమైనది కాబట్టి దేవాలయాలలో భగవంతుని తీర్థంగా భక్తులు స్వీకరిస్తారు.