”శోధిని”

Thursday, 11 June 2015

ముసుగు దొంగలు (జోక్)

మంత్రిగారి భార్య  తన భర్తతో కలసి న్యూస్ ఛానల్ చూస్తోంది.
బ్యాంక్ చోరి కేసు నిందుతులకు ముసుగేసి మీడియా సమావేశంలో ప్రవేశ పెట్టారు పోలీసులు.
మంత్రి గారి భార్య : ఏమండీ నాదొక అనుమానం
మంత్రి : ఏమిటది ?
మంత్రిగారి భార్య : పట్టుపడ్డ దొంగలకు ఇలా ముసుగేసి చూపించడం ఎందుకని ?
మంత్రి  : "పిచ్చి మొహమా ... పూర్వం నాకు కూడా ఇలాగే ముసుగేసి తీసుకెళ్ళారు కాబట్టి, ఇప్పుడు మంత్రినయినా  నన్నెవరూ గుర్తుపట్టడం లేదు"  అసలు విషయం చెప్పాడు మంత్రిగారు.







Sunday, 7 June 2015

పంచభూత లింగాలు !


పంచభూతాత్మక స్వరూపుడు పరమశివుడు.   పంచలింగ ప్రతీకలే పంచభూత లింగాలు.  కంచిలో స్వామి పృధ్వీలింగ రూపంలో,  తిరువన్నామలైలో అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతీకగా,  జంబుకేశ్వరంలో జలలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా మహాశివుడు పూజలు  అందుకుంటున్నాడు.  దోసెడు నీళ్ళతో అభిషేకం ...చిటెకెడు బూడిద అలంకారం ...శంభో శంకర అంటే చాలు, అంతకు మించి ఏమి కోరుకోని భోళాశంకరుడు ఆయన.    


Friday, 5 June 2015

పర్యావరణ పరిరక్షణ ...ప్రగతికి సోపానం !


పర్యావరణాన్ని పరిరక్షించాలంటే...  మనసున్న ప్రతి ఒక్కరూ ప్రకృతితో యుద్ధం చేయడం ఆపి సహజీవనం చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి భాద్యతగా మందుకు రావాలి.    కొండలను పిండి చేయడం మానుకోవాలి.  నదులను స్వేచ్చగా పారనివ్వాలి.  అడవులను  నాశనం చేయడం ఆపాలి.  జంతువులను స్వేచ్చగా తిరగనివ్వాలి.  మొక్కలను నాటి పరిసరాలంతటా పచ్చదనాన్ని  నింపాలి.  నింగి నుండి రాలే ప్రతి నీటి బొట్టును పుడమిలో భద్రంగా దాచాలి.  పర్యావరణానికి ముప్పు వాటిల్లినప్పుడు అకాలవర్షలు అతలాకుతలం చేస్తాయి.  మండే ఎండలు మనుషుల్ని మాడ్చేస్తాయి. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి.  ఋతుపవనాలు గతి తప్పి భూగోళం వేడెక్కుతుంది.  ఇప్పుడయినా  మనిషి మేల్కొనక పొతే రాబోయే  రోజుల్లో మనిషి మనుగడ అసాధ్యం.  రాబోవు తరాల వారిని దృష్టిలో పెట్టుకొని  వారి క్షేమం కోసం హరిత ప్రకృతిని కాపాడుదాం. 


Thursday, 4 June 2015

Sunday, 31 May 2015

పూర్ణాహుతి హోమం.



2012 సంవత్సరం మే నెలలో గుంటూరు జిల్లా, రవ్వవరం శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం వారి ఆధ్వర్యంలో జరిగిన హనుమత్ రక్షాయాగంలో 108 మంది దంపతులుపాల్గొన్న పూర్ణాహుతి హోమం.

Saturday, 30 May 2015

మానవసేవే మాధవసేవ !


శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టిన గొప్ప సేవ అన్నదానం కార్యక్రమం.  నిత్యం ముప్పయివేల మందికి పైగా భక్తులు అన్నదానం కాంప్లెక్స్ లో భోజనం చేసి స్వామివారి మహాప్రసాదం తిన్నంత ఆనందపడిపోతారు. పేద భక్తులకు ఈ సదుపాయం నిజంగా ఒక వరమే !  రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ ఉచిత భోజనాలు పెడుతూనే ఉంటారు.  ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయన చేతుల మీదుగా ప్రారంభమైన గొప్ప పుణ్య సేవా కార్యక్రమం అన్నదానం.

Wednesday, 27 May 2015

యుగపురుషుడు !

     
        కృషి, పట్టుదల, క్రమశిక్షణ, మంచి నడవడికతో... అంకితభావంతో తెలుగు చలనచిత్ర రంగంలో మహోన్నత స్థాయికి చేరుకొని తెలుగు ప్రజల మన్నలను పొందిన గొప్ప నటుడు స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు గారు.  మాటలో మంచితనం, భావనలో వివేకం, సాధనలో పట్టుదల, నటనలో విలీనం రామారావు గారికున్న ముఖ్య లక్షణాలు. సంపూర్ణమైన వ్యకిత్వానికి ఆయన చక్కని నిదర్శనం. 
తెలుగు చలన చిత్రరంగంలో ఎన్నెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి, తనకు          సాటిరారని నిరూపించిన ఎన్టీఆర్ సినీ అభిమానుల హృదయాలలో శ్వత స్థానంసంపాదించుకున్నారు...తెలుగు సినీరంగంలో అగ్రస్థానం   అధిష్టించారు. ఏ పాత్ర పోషించనా ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. చారిత్రాత్మకం, జానపదం, పౌరాణికం, సాంఘీకం ఇలా ఆయని చేయని పాత్రంటూ లేవు. ప్రతి పాత్రలో లీనమై తెలుగువారి హృదయాలలో జీవించి ఉన్నారు .  తెలుగువాడి బింకం, తెలుగువారి మమకారం, తెలుగువాడి మాటతీరు, పద్దతి అంతా ఆయన దివ్యమైన రూపంలో కనిపిస్తుంది. వ్యక్తిగా ఆయన సమున్నతుడు...  వ్యక్తిత్వంలో మహోన్నతుడు.                      
ఇక రాజకీయాల విషయానికొస్తే ...అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కంచుకోటగా ఉంటూ తనకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించన ఘనత ఎన్టీఅర్ గారిది.ఆయన ముఖ్యమంత్రిగా ఒన్న సమయంలోపార్లమెంటులో పెద్ద పార్టీలయిన బిజెపి, సిపిఐ, సిపియంల కంటే ఎక్కువ స్థానాలు 35 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని పార్లమెంటులో ఒక ప్రాంతీయ పార్టీ మొదటి సారిగా ప్రదాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది.  ఇది తెలుగువారందరికీ గర్వకారణం.

         ఎన్టీఅర్ జన్మదిన సందర్భంగా ....