”శోధిని”

Wednesday, 11 December 2013

ఇదొక సరదా!

కొత్త సెల్ కొందామని షాప్ కెళ్ళింది కామాక్షి.  ప్రతి సెల్ ను క్షుణ్ణంగా పరీక్షించింది.  ఏది నచ్చలేదు ఆమెకు, ముఖం అదోలా పెట్టింది. అది గమనించిన సేల్స్ మెన్... 
"ఈ సెల్ తీసుకోండి మేడం ... ఎందులో మీ పక్కింటి వాళ్ళ మాటలు వినే సదుపాయం కుడా వుంది " ఓ  సెల్ ను చూపిస్తూ చెప్పాడు. 
"ఇలాంటి  సెల్ కోసమే ఇన్నాళ్ళు  ఎదురు చూస్తున్నాను " మారు బేరం ఆడక్కుండానే (లేకుంటే సేల్స్ మెన్ ను ముప్పు తిప్పలు పెట్టేది) ఆతను చెప్పిన ధరకే తీసుకొని బైట పడింది కామాక్షి పక్కింటి మాటలు వినడానికి. 

      (ఇది సరదా కోసం రాసింది ... ఎవ్వరిని నొప్పించడానికి కాదని మనవి)

                                        11-12-13


Monday, 9 December 2013

పప్పులో కాలేసినట్లే!

 
'మన ఇల్లు పచ్చగా వుంటే చాలు.   మన చుట్టూవున్న వారితో, పరిసరాలతో మనకు పని లేదు'  అనుకునే వాళ్ళు చాలా మంది వున్నారు.  వీళ్ళు చదువుకోలేని అజ్ఞానులు అంటే అదీ కాదు. బాగా చదువుకున్నవాళ్ళే అధికం. మన ఇల్లు, గేటు వరకే మనదని, దాని తర్వాత ప్రాంతం మనవి కాదని మన ఇంట్లో చెత్త చెదారాన్ని అక్కడ పడేస్తే, క్రిమికీటకాలు చేరి మన ప్రక్కవాళ్ళతో పాటు మనల్ని కుట్టి రోగాలను పుట్టిస్తాయని తెలుసుకోలేని మార్ఖులు.   అంతేకాదు  అది చూసేవాళ్ళకి ఎంత అసహ్యంగా కనిపిస్తుందో ఆలోచించారు. మనం తిరిగే ప్రతీ ప్రాంతం మనదే అనుకుని పరిశుభ్రంగా వుంచడానికి ప్రయత్నించాలి. ఇవ్వన్నీ చేయాలంటే ముందు మన మనసులో ఎలాంటి మలినాలు లేకుండా పరిశుభ్రంగా వుంచుకోవాలి. అప్పుడే మన చుట్టూ వున్న పరిసరాల గురించి ఆలోచిస్తాం. మన చుట్టూ వున్నా పరిసరాలు కుడా మనవే అనే అభిప్రాయం అందరిలో కలగాలి. పరసరాలను కలుషితం చేస్తే ఈగలు, దోమలు, బొద్దింకలు చేరి మన ఇంట్లేకి రాక మానవు. మన పుణ్యమా అని ఇరుగు పొరుగు వాల్లకి చేరక మానవు. మన ఇల్లే శుభ్రంగా వుంచుకుని, మిగిలినది మనకి సంబంధం లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్లే!


Saturday, 7 December 2013

'ఆనందో బ్రహ్మ' హఠాన్మరణం



'ఆనందో బ్రహ్మ' సీరియల్ ద్వారా  పాపులర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతూ రాత్రి కన్నుమూయడంతో  తెలుగు సినీహస్య వినీలాకాశంలోంచి మరో తార రాలిపోయినట్లయింది.  దాదాపు వంద చిత్రాలు పైగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  ఆయన నటించిన తెలుగు సినిమాలలో ఒక లెక్చరర్ గా, అధ్యాపకుడిగా ప్రేక్షకులను తెగ నవ్వించిన పాత్రలు  ఎప్పటికీ గుర్తుండిపోతాయి.  ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు.  సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు  శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.   


Tuesday, 3 December 2013

తెలివైన భర్త !

"మీరు రోజు తాగి ఎంజాయ్ చేస్తూ... నన్ను మాత్రం వంటింటి                       కుందేలును చేశారు" చిర్రుబుర్రు లాడింది తాయారు.
 
"నేను తాగి సుఖపడుతున్నాననే కదా నీ అనుమానం. ఒక్కసారి ఈ మందు రుచి చూడు తెలుస్తుంది"  కొంచెం గ్లాసులో వంపి ఇచ్చాడు సుబ్బారావు.

"ఛీ... ఇంత ఛండాలంగా వుందేమిటి?నాలుక మంట పుడుతోంది...ఎలా         తాగుతున్నారండీ!" ఆముదం తాగిన దానిలా ముఖం పెట్టింది తాయారు.  

"ఏంచేయమంటావు తాయారు... నువ్వు ఇంటి పనిలో కష్టపడుతుంటే, 
నేను మాత్రం ఎలా సుఖపడతాను" భాదపడుతూ చెప్పాడు  తెలివైన సుబ్బారావు.           



Saturday, 30 November 2013

పవిత్రబంధం!

 
అందచందాలతో...  
పనిలేకుండా 
కులమతాలతో... 
సంబంధం లేకుండా 
మల్లెపువ్వులాంటి 
స్వచ్చమైన మనసుతో 
చేసే బంధం పవిత్రబంధం!
ఆ ప్రేమ బంధంలో ...  
 చల్లనిచూపులు...   
మధురమైన పలుకులు... 
ఆప్యాయతానురాగాలు... 
చిరుదరహాసాలు...ఉంటే చాలు
ఆ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది  
అలాంటి ప్రేమను పొందినవారి...  
మనసు ఎప్పుడూ పరిమళిస్తూ ఉంటుంది.  

Wednesday, 27 November 2013

"తల్లీ- కూతుళ్ళు"


"అమ్మా... మీ అల్లుడు రాత్రిపూట లేటుగా వస్తున్నాడే!"
"నా పెళ్ళయిన కొత్తలో మీ నాన్నగారూ కుడా ఇలాగే ఆలస్యంగా వచ్చేవాడు తెలుసా?"
"ఆ అలవాటు ఎలా మాన్పించావ్?"
"ఏముంది ఓ రోజు అర్థరాత్రి వచ్చి తలుపు కొట్టాడు 'మా వారు వచ్చే వేళయింది' అన్నాను. అంతే--- 
ఆ మర్నాడు నుంచి చీకటి పడగానే బుద్దిగా ఇంటికి వచ్చేవాడు.



Sunday, 24 November 2013

"కొంటె కూతురు"


అల్లుడికి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని కబురు వస్తే హడావుడిగా వెళ్ళిన అత్తగారు 'అసలేమయింది అల్లుడు గారూ... ఏక్సిడెంటా?' అని అడిగితే,
తన భార్యవైపు చూపించాడు అల్లుడు 
'ఎమైందో నువ్వైనా చెప్పవే' అని కూతుర్ని అడిగితే.
'నువ్వేకదమ్మా ఆయనితో ఏమైనా తేడా వస్తే నోరు విప్పవోద్దన్నావు- అందుకే చేతికి పని చెప్పా' 
అంది కొంటెకూతురు.