"మీరు రోజు తాగి ఎంజాయ్ చేస్తూ... నన్ను మాత్రం వంటింటి కుందేలును చేశారు" చిర్రుబుర్రు లాడింది తాయారు.
"నేను తాగి సుఖపడుతున్నాననే కదా నీ అనుమానం. ఒక్కసారి ఈ మందు రుచి చూడు తెలుస్తుంది" కొంచెం గ్లాసులో వంపి ఇచ్చాడు సుబ్బారావు.
"ఛీ... ఇంత ఛండాలంగా వుందేమిటి?నాలుక మంట పుడుతోంది...ఎలా తాగుతున్నారండీ!" ఆముదం తాగిన దానిలా ముఖం పెట్టింది తాయారు.
"ఏంచేయమంటావు తాయారు... నువ్వు ఇంటి పనిలో కష్టపడుతుంటే,
నేను మాత్రం ఎలా సుఖపడతాను" భాదపడుతూ చెప్పాడు తెలివైన సుబ్బారావు.
No comments:
Post a Comment