'ఆనందో బ్రహ్మ' సీరియల్ ద్వారా పాపులర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతూ రాత్రి కన్నుమూయడంతో తెలుగు సినీహస్య వినీలాకాశంలోంచి మరో తార రాలిపోయినట్లయింది. దాదాపు వంద చిత్రాలు పైగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన నటించిన తెలుగు సినిమాలలో ఒక లెక్చరర్ గా, అధ్యాపకుడిగా ప్రేక్షకులను తెగ నవ్వించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Saturday, 7 December 2013
Tuesday, 3 December 2013
తెలివైన భర్త !
"మీరు రోజు తాగి ఎంజాయ్ చేస్తూ... నన్ను మాత్రం వంటింటి కుందేలును చేశారు" చిర్రుబుర్రు లాడింది తాయారు.
"నేను తాగి సుఖపడుతున్నాననే కదా నీ అనుమానం. ఒక్కసారి ఈ మందు రుచి చూడు తెలుస్తుంది" కొంచెం గ్లాసులో వంపి ఇచ్చాడు సుబ్బారావు.
"ఛీ... ఇంత ఛండాలంగా వుందేమిటి?నాలుక మంట పుడుతోంది...ఎలా తాగుతున్నారండీ!" ఆముదం తాగిన దానిలా ముఖం పెట్టింది తాయారు.
"ఏంచేయమంటావు తాయారు... నువ్వు ఇంటి పనిలో కష్టపడుతుంటే,
నేను మాత్రం ఎలా సుఖపడతాను" భాదపడుతూ చెప్పాడు తెలివైన సుబ్బారావు.
Saturday, 30 November 2013
Wednesday, 27 November 2013
"తల్లీ- కూతుళ్ళు"
"అమ్మా... మీ అల్లుడు రాత్రిపూట లేటుగా వస్తున్నాడే!"
"నా పెళ్ళయిన కొత్తలో మీ నాన్నగారూ కుడా ఇలాగే ఆలస్యంగా వచ్చేవాడు తెలుసా?"
"ఆ అలవాటు ఎలా మాన్పించావ్?"
"ఏముంది ఓ రోజు అర్థరాత్రి వచ్చి తలుపు కొట్టాడు 'మా వారు వచ్చే వేళయింది' అన్నాను. అంతే---
ఆ మర్నాడు నుంచి చీకటి పడగానే బుద్దిగా ఇంటికి వచ్చేవాడు.
Sunday, 24 November 2013
"కొంటె కూతురు"
అల్లుడికి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని కబురు వస్తే హడావుడిగా వెళ్ళిన అత్తగారు 'అసలేమయింది అల్లుడు గారూ... ఏక్సిడెంటా?' అని అడిగితే,
తన భార్యవైపు చూపించాడు అల్లుడు
'ఎమైందో నువ్వైనా చెప్పవే' అని కూతుర్ని అడిగితే.
'నువ్వేకదమ్మా ఆయనితో ఏమైనా తేడా వస్తే నోరు విప్పవోద్దన్నావు- అందుకే చేతికి పని చెప్పా'
అంది కొంటెకూతురు.
Friday, 22 November 2013
మాయల మరాఠీలు!
మన నాయకులు
మాయల మరాఠీలు
మాయమాటలతో
ప్రజలను ఏమార్చి
పబ్బం గడుపుకునే
ఘనాపాటీలు!
పదవికోసం
ఎన్నో వేషాలు
గడ్డి తినడానికే
ఎన్నోమోసాలు
అందుకే ...
దేశం పతనం వైపు
పరుగులు తీస్తోంది
మాయల మరాఠీలు
మాయమాటలతో
ప్రజలను ఏమార్చి
పబ్బం గడుపుకునే
ఘనాపాటీలు!
పదవికోసం
ఎన్నో వేషాలు
గడ్డి తినడానికే
ఎన్నోమోసాలు
అందుకే ...
దేశం పతనం వైపు
పరుగులు తీస్తోంది
Saturday, 16 November 2013
కార్తీక పౌర్ణమి
దీపావళి పండుగ అనంతరం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో వచ్చే పున్నమి చాలా పవిత్రమైనది. అందుకే ఈ రోజున పూజలు, అభిషేకాలు, వ్రతాలు, దీపారాధనలతో గృహాలు, దేవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం కలుగుతుందని భుక్తుల విశ్వాసం. ఈ రోజున మహిళలు 365 వత్తులతో ప్రీతికరంగా దీపాలను వెలిగిస్తారు. కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికర మైనందువల్ల ఆన్ని దేవాలయాలలో దీపాలను వెలిగిస్తారు.
అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
Subscribe to:
Posts (Atom)



