Sunday, 6 November 2011
Thursday, 3 November 2011
'డెంగీ' కి తోడు 'హంటా వైరస్'
రాష్ట్రము మాయదారి రోగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక పక్క 'డెంగీ' జ్వరం పంజా విసరడంతో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క దీనికితోడుగా 'హంటా' అనే మాయరోగం వచ్చి చేరింది. ఈ వ్యాధి ఎలుకల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందని, ఇంతవరకూ 'హంటా' కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, ముందు జాగ్రత్తలే మేలని డాక్టర్లు అంటున్నారు. 'డెంగీ' మాదిరిగానే 'హంటా' వైరస్ వల్ల తీవ్రమైన జ్వరం, వణుకు వస్తుందని, భరించలేని ఒళ్ళు, కీళ్ళ నొప్పులతోపాటు వాంతులు అవుతుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్శ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎలుకలను ఇంట్లో లేకుండా చూసుకోవాలని, భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు. ప్రతి మనిషి తాను నివసించే ఇల్లు, పరిసరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంట్లో చెత్తను పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కుండీలలో మాత్రమే వేయాలి. ఒకవేళ ఇంటిముందు మురికి కాల్వలున్నట్లయితే అక్కడ మురికి పేరుకుపోకుండా నీటి ప్రవాహం వేగంగా సాగేటట్టు చూడాలి. రెండు రోజులకొకసారి బ్లీచింగ్ పౌడర్ చల్లుతుంటే ఈ వ్యాధులకు కారణమైన దోమలు దరిచేరవు. ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధుల బారినుండి బయటపడవచ్చు.
Sunday, 30 October 2011
నాగుల చవితి
కార్తీకమాసం నెలరొజులూ పవిత్రమైనవే. కార్తీకంలో శుక్ల పక్ష చవితినాడు జరుపుకొనే పండుగ 'నాగుల చవితి'. ఈ రోజున పెద్ద సంఖ్యలో మహిళలు
పుట్టలో పాలు పోసి నాగదేవతను భక్తిశ్రద్దలతో పూజిస్తారు. బెల్లం,నువ్వుల
పిండితో తయారు చేసిన చలిమిడిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విదంగా
నాగదేవతను పూజిస్తే ఎన్నో ఫలితాలుంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
నాగులచవితి, నాగులపంచమి పవిత్రరోజులలో మాత్రమే సర్పాలను పూజించి,
మిగాతారోజులల్లో పాములు కనిపించగానే చంపడానికి ప్రయత్నం చేయకుండా
వాటిని తోటి ప్రాణులుగా చూడాల్సిన భాద్యత మనందరిది.
Tuesday, 25 October 2011
దీపావళి శుభాకాంక్షలు!
"దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన! దీపేన హరతే పాపం సంధ్యాదీప నమోస్తుతే!"
సిరిసంపదలు సమకూర్చే దీపావళి మీ ఇంట ఆనందవెలుగులు నింపాలని కోరుకుంటూ....
బ్లాగరులందరికీ దీపావళి శుభాకాంక్షలు!
Monday, 24 October 2011
అమావాస్య వెన్నెల
నక్షత్రాలన్నీ దివినుంచి భువికి దిగివచ్చేరోజు, ప్రతియింటా నవ్వుల దీపాలు వెలిగేరోజు, పెద్దలు పిల్లలుగా మారేరోజు దీపావళి రోజు. దీపావళి గురించి రకరకాలుగా కథలు ఉన్నప్పటికీ అందులో నరకాసురుడి వధ ప్రధానమైనది. కాని, అన్ని కథల్లో 'చెడు' ఫై 'మంచి' చేసిన విజయమని తెలియజేస్తున్నాయి. ఈ విజయోత్సవానికి గుర్తుగా అమావాస్య నాడు ప్రతియింటా వెలుగులనునింపి, చీకటిని పారద్రోలడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఇల్లన్ని శుభ్రపరచి చక్కగా అలంకరించి, సాయంత్రం దీపాలతో వెలుగులు నింపుతారు. కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మహాలక్ష్మి తల్లిని ఆహ్వానం పలుకుతారు.మన పండులన్నిదాదాపు సూర్యోదయంతో మొదలయితే, దీపావళి మాత్రం సూర్యాస్తమయంతో ప్రారంభం కావడం విశేషం.కులమతాలకుఅతీతంగా, పెద్దలు, పిల్లలు అంతా ఆనదంగా జరుపుకునే పండుగ వెలుగుజిలుగుల దీపావళి. ఈ పండుగనాడు బాణా సంచా కాల్చడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే బాణా సంచా కాల్చేటప్పుడు ప్రమాదాలకు గురికాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, పెద్దలు సమక్షంలో ఆరుబైట బాణా సంచా కాల్చడం, టపాకాయలను విసిరేయకుండా ఉండడం, ప్రేలుడు టపాకాయలను తగినంత దూరంలో ఉంచడం చేయాలి. చేతులు కాలకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలి. బాణా సంచా పేల్చడంలో జాగ్రత్తలు విస్మరిస్తే ప్రమాదాలు సంభవిస్తాయి. తస్మాత్ జాగ్రత్త.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు!Thursday, 20 October 2011
హిజ్రాల ఆగడాలు
జంటనగరాలలో హిజ్రాల ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించిపోతున్నాయి. రోడ్డునపోతున్నవారు వీరిని
చూడగానే బెంబేలు పడాల్సిన పరిస్తితి నెలకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బు కోసం వీరి వేధింపులు
ఆగడం లేదు. ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు . ఉదయమే జంటలు జంటలుగా రోడ్డుమీదికి
వచ్చి, వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వారికి చుక్కలు చూపిస్తారు. అసభ్యకర ప్రవర్తన , భూతులు
మాట్లాడుతూ వారిని కించపరుస్తూ రచ్చ రచ్చ చేస్తారు. వీరిబారినుండి ఎలా తప్పించుకోవాలో తెలియక
ప్రజలు అవస్థలు పడుతున్నారు. హిజ్రాలందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కస్టపడి పనిచేసుకోవడానికి
ఎన్నో మార్గాలున్నాయి. ఇలా ప్రజలను వేదించడం ఎందుకు? అడుక్కోవడానికి ఎన్నోమర్గాలుండగా
ప్రజలను పీల్చి పిప్పిచేయడం ఎందుకు? ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. హిజ్రాల
జీవనోపాధికోసం ప్రభుత్వం తగుచర్యలు తీసుకొని హిజ్రాల ఆగడాలను అరికట్టాలి.
Wednesday, 19 October 2011
టీవీల్లో వాణిజ్య ప్రకటనలు
టీవీల్లో వస్తున్న కొన్ని వస్తువుల వాణిజ్య ప్రకటనలు అభ్యంతరకరంగా ఉంటున్నాయి. కుటుంభ సభ్యులంతా
కలసి టీవీ చూస్తున్నప్పుడు జుగుస్సాకరమైన దృశ్యాలను ప్రసారం చేయడాన్ని నిలువరించాల్సిందే!
సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్న ఇలాంటి వాటిని ప్రసారాలకు ఎలా అనుమతిస్తున్నారో అర్థం
కావడం లేదు. ప్రకటనలు వస్తు నాణ్యతకు సంబందించినదిగా ఉండాలి. వాటి సద్గుణాలను ప్రజలకు తెలియజేసేవిధంగా మలచాలి . అసభ్య దృశ్యాలు ఉన్న ప్రకటనల్ని ప్రసారం చేయడం నైతిక విలువలకు తిలోదకాలివ్వడమే అవుతుంది. టీవీల యాజమాన్యం ఇలాంటి అసభ్యకరమైన వాణిజ్య ప్రకటనలను
తమ ఛానల్లో ప్రసారం చేయకుండా చూడాలి.
Subscribe to:
Posts (Atom)

