నక్షత్రాలన్నీ దివినుంచి భువికి దిగివచ్చేరోజు, ప్రతియింటా నవ్వుల దీపాలు వెలిగేరోజు, పెద్దలు పిల్లలుగా మారేరోజు దీపావళి రోజు. దీపావళి గురించి రకరకాలుగా కథలు ఉన్నప్పటికీ అందులో నరకాసురుడి వధ ప్రధానమైనది. కాని, అన్ని కథల్లో 'చెడు' ఫై 'మంచి' చేసిన విజయమని తెలియజేస్తున్నాయి. ఈ విజయోత్సవానికి గుర్తుగా అమావాస్య నాడు ప్రతియింటా వెలుగులనునింపి, చీకటిని పారద్రోలడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఇల్లన్ని శుభ్రపరచి చక్కగా అలంకరించి, సాయంత్రం దీపాలతో వెలుగులు నింపుతారు. కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మహాలక్ష్మి తల్లిని ఆహ్వానం పలుకుతారు.మన పండులన్నిదాదాపు సూర్యోదయంతో మొదలయితే, దీపావళి మాత్రం సూర్యాస్తమయంతో ప్రారంభం కావడం విశేషం.కులమతాలకుఅతీతంగా, పెద్దలు, పిల్లలు అంతా ఆనదంగా జరుపుకునే పండుగ వెలుగుజిలుగుల దీపావళి. ఈ పండుగనాడు బాణా సంచా కాల్చడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే బాణా సంచా కాల్చేటప్పుడు ప్రమాదాలకు గురికాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, పెద్దలు సమక్షంలో ఆరుబైట బాణా సంచా కాల్చడం, టపాకాయలను విసిరేయకుండా ఉండడం, ప్రేలుడు టపాకాయలను తగినంత దూరంలో ఉంచడం చేయాలి. చేతులు కాలకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలి. బాణా సంచా పేల్చడంలో జాగ్రత్తలు విస్మరిస్తే ప్రమాదాలు సంభవిస్తాయి. తస్మాత్ జాగ్రత్త.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
No comments:
Post a Comment