రాష్ట్రము మాయదారి రోగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక పక్క 'డెంగీ' జ్వరం పంజా విసరడంతో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క దీనికితోడుగా 'హంటా' అనే మాయరోగం వచ్చి చేరింది. ఈ వ్యాధి ఎలుకల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందని, ఇంతవరకూ 'హంటా' కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, ముందు జాగ్రత్తలే మేలని డాక్టర్లు అంటున్నారు. 'డెంగీ' మాదిరిగానే 'హంటా' వైరస్ వల్ల తీవ్రమైన జ్వరం, వణుకు వస్తుందని, భరించలేని ఒళ్ళు, కీళ్ళ నొప్పులతోపాటు వాంతులు అవుతుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్శ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎలుకలను ఇంట్లో లేకుండా చూసుకోవాలని, భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు. ప్రతి మనిషి తాను నివసించే ఇల్లు, పరిసరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంట్లో చెత్తను పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కుండీలలో మాత్రమే వేయాలి. ఒకవేళ ఇంటిముందు మురికి కాల్వలున్నట్లయితే అక్కడ మురికి పేరుకుపోకుండా నీటి ప్రవాహం వేగంగా సాగేటట్టు చూడాలి. రెండు రోజులకొకసారి బ్లీచింగ్ పౌడర్ చల్లుతుంటే ఈ వ్యాధులకు కారణమైన దోమలు దరిచేరవు. ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధుల బారినుండి బయటపడవచ్చు.
No comments:
Post a Comment