కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను
పూజించిన పుణ్యం కలుగుతుందని భుక్తుల విశ్వాసం.
ఈ రోజున మహిళలు 365 వత్తులతో ప్రీతికరంగా దీపాలను వెలిగిస్తారు. పున్నమి రోజున చేసే
శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్తీక పౌర్ణమి నాడు చెప్పుకోతగ్గ అంశం దీపారాధన. దేవుని సన్నిధిలో, పవిత్రమైన తులసికోట దగ్గర బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాల వెలిగించాలి. ఆ దీపాలను కుంకుమ, పసుపు, పూలతో అలంకరించి దీపం వెలిగిస్తే విశేష శుభఫలితాలు, సకల సంపదలు దరిచేరతాయని ప్రజల విశ్వాసం.
No comments:
Post a Comment