ఋతువులలో ఎంతో సుందరమైనది వసంత రుతువు. ఈ ఋతువు వస్తూ... వస్తూ... తెలుగువారి నూతన సంవత్సరం 'ఉగాది'ని తెస్తుంది. ఆమని రాకతో ప్రకృతి పరవశిస్తుంది....పుడమి పులకించిపోతుంది. ప్రకృతి కాంత కొత్త రంగులు పులుముకొని నూతనత్వానికి నాంది పలుకుతుంది. హరిత వర్ణపు శోభతో... చిగురించిన లేత ఆకులతో... లోకమంతా పచ్చగా నవనవలాడుతూ కనపడుతుంది. వసంత ఋతువులో ప్రకృతి తన అందాన్ని చూసుకుని మురిసిపోతుంది. వేప పువ్వులు , మామిడి పువ్వులు, లేత చిగుళ్ళు , జాజి, మల్లెల సువాసనలతో పరిసరాలన్నీ ఘుమఘుమలాడుతూ శోభాయమానంగా కనిపిస్తాయి. లేత చిగుళ్ళు తింటూ మత్తుగా కూసే కోయిల పాట వినడానికి ఎంతో ఇంపుగా ఉంటుంది. కొత్త బెల్లం, కొత్త చింతపండు , మామిడి కాయలు , వేపపువ్వు, ఉప్పు, కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడి ఒక దివ్య ఔషదం. షడ్రుచులలాగే జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను, మంచిచెడులను దైర్యంగా ఎదుర్కొని జీవించడానికి సిద్దంగా ఉండాలని ఈ ఉగాది పచ్చడి అర్థం. తెలుగు ప్రజలంతా మన సంస్కృతీ సంప్రదాయాలతో ఆనందంగా జరుపుకునే పండుగ 'ఉగాది' పర్వదినం. తెలుగువారి నూతన సంవత్సరం ప్రతి మనిషిలోనూ నూతనత్వాన్ని నింపాలని మనసారా కోరుకుందాం.
Tuesday, 28 March 2017
Saturday, 25 March 2017
"మల్లెపూల మహత్యం"
వేసవికాలం వచ్చిందంటే చాలు మనసంతా మల్లెల పరిమళాలు గుభాలిస్తాయి. విచ్చుకున్న మల్లెలు ఇంటిని సుగంధాలతో నింపేస్తుంటాయి. ఆహ్లాదపరిచే మల్లెల సోయగాలు మనసును అలరిస్తాయి. మగువలు మెచ్చిన మల్లెలు మదిని మురిపిస్తాయి. మగువ సిగలో ఎన్ని రకాల పువ్వులు ఒదిగినా మల్లెపూల ముందు దిగదుడుపే. పరిమళానికి, సోయగానికి స్వచ్చమైన దవళకాంతులకు మారుపేరయిన మల్లెలు స్త్రీల సిగలో సహజ ఆభరణాలు. ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా, సాయంకాలం వేళ మల్లెలను చూడగానే రోజంతా పడిన కష్టం ఇట్టే మరచిపోతారు. సాయంత్రానికి వెండి వెన్నెల కురిపిస్తూ విరబూయటం వీటి ప్రత్యకత ! పరిమళానికి మారుపేరయిన పరిమలభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే ! ఈ పూల సుగందానికి పరవసించని మనసే ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు చల్లదనానికి, గుభాలింపులకు మారుపేరు మల్లెల సౌరవం జీవితాలనే మార్చేస్తుంది. శృంగారానికి, మల్లెపూలకు అవినాభావ సంబంధం ఉండటంతో మగవారికి కూడా ఈ సుగంధ మల్లెలంటే చాలా ఇష్టం. అందుకే శోభనం రాత్రికి ఈ పూలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇదీ మల్లెపూల మహత్యం.
Saturday, 18 March 2017
"కలిసుంటే కలదు సుఖం"
"హలో సార్" అంటూ ఎదురుగా వస్తున్న వారిని పలకరిస్తే ఆహ్లాదం మదిలో చిందులు వేస్తుంది. స్నేహ పుష్పం మొలకలేస్తుంది. ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు పంచుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటే ఎంత బాగుండు అని పిస్తుంది. కానీ, ఒక చోట నివసించేవారు అంటీ ముట్టనట్టు ఎడముఖం, పెడమొహంగా ఉంటే, అందరితో కలిసిపోవాలనుకునేవారికి కూడా చిరాకనిపిస్తుంది. ఇతరులతో మాకు సంబంధం ఏమిటనో తలుపులు మూసుకుని ఏకాంత జీవితానికి అలవాటయి పోతున్నారు. అలా ఉండటంలో ఆనందం ఏమిటో మరి వారికే తెలియాలి. ఒకరుకొకరు ఎదుటపడి కలుసుకున్నప్పుడు ఎదుటివారే పలకరించాలని, మనం పలకరిస్తే మన హోదా తగ్గుతుందనే సంకుచిత మనస్తత్వాలు కొందరివి. వీటన్నిటికీ కారణం అహం. అహం మనిషిని మృగంగా మారుస్తుంది. ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. అహం పెరిగితే బంధాలు విచ్చిన్నమైపోతాయి. ఒకరినొకరు
పట్టించుకోకుండా ప్రవర్తిస్తే, ఈర్ష్యాద్వేషాలు సంక్రమించి నిర్లిప్త స్వభావం ఏర్పడుతుంది. కూలి చేసుకునే పేదవారు కలసి మెలసి కులాసాగా జీవిస్తున్నారు. ఉన్నదాంట్లోనే తింటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. రక్తసంబంధం కాకపోయినా అన్నయ్య, అక్కయ్య అంటూ వరసలు కలుపుకొని కలుపుగోలుగా ఉంటారు. వారికి ఆస్తులు లేకపోయినా, అభిమానాలుంటాయి. సౌకర్యాలు లేకపోయినా సుఖముంటుంది. ఇంటికి తులుపులు లేకపోయినా కంటి నిండా నిద్ర పడుతుంది. ఆ పేదవారిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా వుంది.
పట్టించుకోకుండా ప్రవర్తిస్తే, ఈర్ష్యాద్వేషాలు సంక్రమించి నిర్లిప్త స్వభావం ఏర్పడుతుంది. కూలి చేసుకునే పేదవారు కలసి మెలసి కులాసాగా జీవిస్తున్నారు. ఉన్నదాంట్లోనే తింటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. రక్తసంబంధం కాకపోయినా అన్నయ్య, అక్కయ్య అంటూ వరసలు కలుపుకొని కలుపుగోలుగా ఉంటారు. వారికి ఆస్తులు లేకపోయినా, అభిమానాలుంటాయి. సౌకర్యాలు లేకపోయినా సుఖముంటుంది. ఇంటికి తులుపులు లేకపోయినా కంటి నిండా నిద్ర పడుతుంది. ఆ పేదవారిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా వుంది.
Sunday, 12 March 2017
Saturday, 11 March 2017
"సహజ రంగులతో ఆనందకేళి"
వసంత ఋతువు
ఆగమనాన్ని పురష్కరించుకొని ఆనందోత్సాలతో... ఆహ్లాదంగా
జరుపుకునే ఆత్మీయానురాగాల రంగుల కేళి హోలి. పిల్లలు, పెద్దలు అనే తేడ లేకుండా, కులమతాలనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండుగ హోలి. వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో
మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి. నాడు సంప్రదాయ బద్దమైన హోలీ పండగను
ప్రమానురాగాలకు తార్కాణంగా జరుపుకునే వారు. ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో,
వేపాకులు, తులసాకులు, పసుపు, కుంకుమ కలిపిన నీటిని వసంతోత్సవంగా
జరుపుకునేవారు. ఇలా చేయడం వల్ల చర్మవ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. ముఖ్యంగా
మోదుగ పూలతో తయారు చేసుకున్న రంగును వాడేవాళ్ళు. నేడు వాటి స్తానంలో
కృత్రిమ రసాయనిక రంగులు మార్కెట్లోకి రావడంతో ప్రజలు వాటి పైన మోజు
పెంచుకుని లేని అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. అనేక
చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కృత్రిమ రంగులతో హోలీ ఆడడం వలన వాటిల్లోని కెమికల్స్ నేత్ర, చర్మ, జీర్ణకోశ సంబంధిత అవయాల పైన తీవ్ర ప్రభావం చూపుతాయి కాబట్టి, సహజసిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవడం సరైన మార్గం. కృత్రిమ రంగులు ప్రమాదకరం ...సహజ రంగులు ఆనందకరం! కృత్రిమ రంగులకు దూరంగా ఉండండి...ప్రకృతిలో లభించే సహజ రంగులను వినియోగించండి!!
అందరికీ హోలీ శుభాకాంక్షలు!
అందరికీ హోలీ శుభాకాంక్షలు!
Friday, 10 March 2017
సృష్టి రహస్యం
ప్రకృతిని సృష్టించిన తరువాత భూమ్మీద వున్న ఘన పదార్థాలన్నీటిని కలిపి పురుషుడికి ప్రాణం పోశాడంట బ్రహ్మ. ఒంటరిగా కొన్ని రోజులు తిరిగిన పురుషుడికి ఏమీ తోచక బ్రహ్మ దగ్గరికి వెళ్లి 'నాకేమి తోచడం లేదు అన్నాడట'.
'సరే... నీకు తోడు కావాలి కదా! అలాగే ఇస్తాను' అని చెప్పి, సృష్టిలోని అద్భుతాలన్నీ మేళవించి అద్బుతమైన 'స్త్రీ'కి ప్రాణం పోశాడట.
వారం రోజులు గడిచాక బ్రహ్మ దగ్గరకి పరుగెత్తుకొచ్చిన మగవాడు "స్వామి...! మీరు తోడుగా ఇచ్చిన జీవి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది....విరామం లేకుండా మాట్లాడుతోంది. నాకు ఏకాంతం లేకుండా చేస్తోంది... నేనామెతో కలిసి బతకలేను....ఈ జీవిని వెనక్కి తీసుకో" ఆన్నాడట.
చురునవ్వుతో ఆ యువతిని వెనక్కి తీసుకున్నాడట బ్రహ్మ.
రెండు రోజులు గడవక ముందే మళ్ళీ పరుగెత్తుకొచ్చిన పురుషుడు "దేవా...! ఆ జీవి నాకు దూరం అయినప్పటి నుంచి జీవితంలో ఉత్సాహం పోయింది. సంతోషం కరువయింది. తక్షణమే ఆమె నాకు కావాలి... ఆమె లేకుండా జీవించలేను" వేడుకున్నాడట.
"చూడు నాయన ఇప్పటి కైన తెలిసిందా... 'స్త్రీ' అంటే ఏమిటో.... స్త్రీలు లేని చోట శోభ కొరవడుతుంది. వారు లేకపోతే ప్రేమతత్వం వికసించదు. నిండుదనం లోపిస్తుంది ... అందం, ఆనందం ఉండదు" అని చెప్పి బ్రహ్మ అదృశ్యమయ్యాడట.
Tuesday, 7 March 2017
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
లాలించే తల్లిగా, ప్రేమను పంచే అర్థాంగిగా నేటి సమాజానికి స్పూర్తి ...రేపటి సమాజానికి వెలుగు మహిళ. ప్రపంచంలో ముందుకు వెళుతూ... అభివృద్దిలో, ఆధునిక జీవనపథంలో దూసుకుపోతూ మనవాళ్ళకు తీసిపోమంది. అయితే గ్రామీణప్రాంత మహిళలు, పట్టణాలలోని పేద మహిళలకు మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించాలి. వారిలో ఆత్మవిశ్వాసం, చైతన్యం తెచీన్దుకు గ్రామీణ ప్రాంతాలలో కూడా సభలు, సమావేశాలు నిర్వహించి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాల గురించి తెలియజేయాలి. అంతర్జాతీయ
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా సమైక్య
శక్తులుగా, సాహస మూర్తులుగా ఉద్యమించాలని కోరుకుంటూ...
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
Subscribe to:
Posts (Atom)