పుణ్యమంతా తమకే దక్కాలనే ఉద్దేశంతో కొందరు 'భక్తి' అనే ముసుగులో అంగరంగ వైభోగాలకు, ఆడంబరాలకు వెళుతూ ఉంటారు. దీనికి కారణం మన చుట్టూ ఉన్న వాతావరణం, అవగాహనారాహిత్యం. ఇలాంటి భక్తి ఎప్పటికీ నిజమైన భక్తి అనిపించుకోదు. హృదయంలో నిత్యం భగవంతుడిని నిలుపుకొని పత్రమో, ఫలమో, పుష్పం లేదా నీటినిగాని భక్తితో భగవంతుడికి సమర్పించిన వారికి భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంతేకాదు ఎదుటివారిని గౌరవిస్తూ, వారిలో దేవుడ్ని చూడటమే నిజమైన భక్తి. నన్ను మించిన వారు లేరు అనే అహంభావం, మంచి చెడ్డల్ని విస్మరింపచేసే అహంకారంతో ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు.
No comments:
Post a Comment