ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం. ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు. అందుకే వినాయకచవితి నాడు నీటిలో కరిగే మట్టి విగ్రహాన్ని పూజించాలి... పర్యావరణాన్ని పరిరక్షించాలి. కొండంత దేవుడుకి కొండంత పత్రి సమర్పించాకపోయినా ఫలమో, పత్రమో ఏదో ఒకటి స్వామికి నివేదిస్తే చాలు గణనాధుడు తృప్తి చెందుతాడు. పర్యావరణ పరిరక్షణతో పాటు జలవనరులు, జీవరాసుల పరరక్షణ, మానవుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సహజసిద్ధమైన రంగులతో వినాయక విగ్రహాలను తయారుచేయడం వల్ల నీటిలో నివసించే జీవరాసులకు ముప్పు వాటిల్లదు. మనం తినే ఆహారం, నీరు కలుషితం కాకుండా ఉంటాయి. గణపతిని పూజించేందుకు ప్రకృతిలో లభించే ఆకులు, పువ్వులు, పండ్లను వినియోగిస్తాం. వినాయక ప్రతిమలను మాత్రం ప్రమాదకరమైన రసాయానక రంగులతో తయారు చేస్తున్నారు. భగవంతుడు ప్రమాదకరమైన రంగులను కోరుకోడు....ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన రంగులనే ఇష్టపడతాడు. మట్టితో చేసి రంగులువేయని వినాయక విగ్రహాన్ని పూజించడం వలన కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని, వ్యవసాయాభివృద్ది కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.
మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!
No comments:
Post a Comment