ఆద్యాత్మికతకు, ఆహ్లాదానికి నెలవుగా విరాజిల్లుతోంది హైదరాబాద్ సమీపంలో వున్న కీసరగుట్ట. కొండల మధ్య ప్రశాంత వాతావరణంలో కీసరగుట్ట పై కొలువున్న శ్రీరామ లింగేశ్వరస్వామి నిత్యపూజలు అందుకుంటున్నాడు. ఆలయ పరిసరాలలో వున్న పచ్చని వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతుంది... గొప్ప అనుభూతిని కలుగజేస్తుంది... ప్రకృతి రమణీయత కళ్ళను కట్టి పడేస్తుంది. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఎత్తైన హనుమంతుని విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
No comments:
Post a Comment