శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగించే పవిత్రమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. కార్తీకమాసంలో మనం పాటించే నియమాలే మనకు భగవంతుని అనుగ్రహం దక్కేలా చేస్తూ ఉంటాయి. ఈ మాసంలో చేసే దైవారాధన, జపం, ఉపరాస దీక్షలు, దీపారాధనలు, దానధర్మాలు, అన్నదానం అన్నీ కూడా అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయని చెబుతారు. కార్తీకమాసంలో 'దీపం' ప్రత్యేకత అందరికీ తెలిసిందే ! ఈ సందర్భంగా రెండు తెలుగురాష్ట్రప్రజలను, అలాగే దేశ ప్రజలందరినీ చల్లగా చూడమని శివకేశవులను మనసారా ప్రార్థిస్తున్నాను.
No comments:
Post a Comment