Wednesday, 29 October 2014
Monday, 27 October 2014
ప్రకృతిని కాపాడుకుందాం !
ప్రకృతిని కాపాడుకుందాం !
కొందరు ఆధునిక అవసరాల పేరుతో
కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ
ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు
మరికొందరు ధన సంపాదనకోసం
నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ
అత్యంత దయనీయంగా, క్రూరంగా
పెనువిద్వంసం సృష్టిస్తున్నారు
ఫలితంగా తుఫానులు, భూకంపాలు!
మన కళ్ళను మనేమే పొడుచుకుంటున్నాం
మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం
ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు
రెక్కలు తెగిన పక్షుల్ల విలవిలాడుతున్నాయి
పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం
మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !
Saturday, 25 October 2014
Wednesday, 22 October 2014
దీపావళి శుభాకాంక్షలు !
మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం శరదృతువు. వానలు తగ్గి, చలికాలం ఆరంభమయ్యే సమయంలో దీపావళి పండుగ రావడం సంతోషదాయకం...ఆనందదాయకం. చెడు అనే చీకటిని పారద్రోలి, మంచి అనే వెలుగును నింపడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. విజయానికి ప్రతీతగా ప్రతి ఇంటా చీకటిని పారద్రోలి... వెలుగులను నింపి, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్ర్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తాం. కులమతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు ఆనందంగా జరుపుకునే పండుగ వెలుగు జిలుగుల దీపావళి. ఈ రోజున లక్ష్మిదేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తే లక్ష్మి కటాక్షం సిద్దిస్తుందని ప్రజల విశ్వాసం. ఈ దివ్యకాంతుల దీపావళి మీ ఇంటిల్లిపాదికీ సుఖశాంతులు, సిరిసంపదలు, మధురానుభూతులు మిగిల్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు !
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు !
Saturday, 18 October 2014
Thursday, 16 October 2014
Wednesday, 15 October 2014
Friday, 10 October 2014
స్త్రీలను గౌరవిద్దాం !
నాటి రామాయణం నుండి నేటి ఆధునిక
యుగం వరకు పరిశీలిస్తే, పరస్త్రీ వ్యామోహం కలవారెవరూ బాగుపడిన దాఖలాలు
లేవు. అనేక గొడవలకు, హత్యలకు కారణమయ్యే అత్యంత హేయమైన గుణం పరస్త్రీల పైన
మొహం. కామం మనిషిని గుడ్డివాడ్ని చేస్తుంది. చదువుకునే పిల్లల నుంచి,
కాటికి కాళ్ళు చాపే ముసలువాళ్ళ వరకు ఈ చెడు వ్యసనానికి బానిసలయి, ఎన్ని
దుర్మార్గాలు చేస్తున్నారో... జనం చేత ఎట్ల ఛీ అనిపించుకుంటున్నారో
చూస్తూనే ఉన్నాం. ఇల్లాలితో స్వర్గ సుఖాలను అనుభవించవలసిన జీవితాన్ని
చేజేతులా మురికి కూపంలోకి నేట్టుకుంటున్న అభాగ్యులు ఒక్కసారి
ఆలోచేస్తే...ఈ కామాంధకారంలోంచి బయటపడగలరు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, స్త్రీలను
ఆదరించడం మన సంస్కృతి.
Wednesday, 8 October 2014
Sunday, 5 October 2014
Saturday, 4 October 2014
ఆరోగ్యానికి అమృత ఫలాలు !
జీవితంలో మనిషికి ముఖ్యమైనది మంచి ఆరోగ్యం. మన ఆహారంలో పప్పు, గింజదాన్యాలు, కూరగాయలే కాకుండా పండ్లను కుడా ఒక భాగం చేసుకుంటూ, ఏదోవిధంగా తీసుకుంటూఉంటే చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఎన్నో ఔషద గుణాల కలిగిన కమలా పండు, వెంటనే తక్షణం శక్తినిచ్చే ద్రాక్ష, అధికపోషక విలువలున్నఅనాస, కేన్సర్ ని నిరోధించే మామిడిపండు, విటమిన్ ఎ,సి, బి 6, పుష్కలంగా లభించే పుచ్చకాయ, వేసవి తాపాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే ఖర్బుజాపండు, ఇదేవిధంగా అరటి, జామ, ఆపిల్, సపోటా... ఇలా వేరువేరు కాలాల్లో ఒక్కొక్క రకంగా మనకు లభిస్తూ ఉంటాయి. వాటిని తింటూ ఉంటే కలిగే ప్రయోజనాలు అమూల్యం.
Thursday, 2 October 2014
విజయదశమి శుభాకాంక్షలు !
విజయాలను అందించే పర్వదినం దసరా
పండుగ. ఈ పండుగ సందర్భంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మ
ఆశీస్సులు లభిస్తాయంటారు. దేవీనవరాత్రుల సందర్భంగా ఆలయాలలో రోజుకో రూపంలో
అమ్మవారిని అలంకరిస్తారు. తమను వేధిస్తున్న మహిషాసురిడికి స్త్రీ వలన
మృత్యువు వాటిల్లుతుందని గ్రహించిన దేవతులు విష్ణువును శరణు కోరతారు.
అప్పుడు విష్ణువు సకలదేవతాంశాలను తేజోశ్శక్తులుగా కలబోసుకొని ఒక స్త్రీ
ఆవిర్భవించినట్లయితే, మహిశాసురుడిని ఆ స్త్రీమూర్తి చేత సంహరించ చేయవచ్చునని చెబుతాడు.
ముందుగా బ్రహ్మ ముఖం నుండి తేజోరాసి ఆవిర్భవించింది. శివుడు నుండి
వెండిలాగా ధగధగలాడుతున్న మరోకాంతి పుంజం మణి కాంతులతో వెదజల్లుతూ
కనిపించింది. విష్ణుమూర్తి నుండి నీలం రంగులో మూర్తీభవించిన సత్వగుణం
లాగావున్న ఇంకో తేజస్సు వెలువడింది. ఇలా సకలదేవతలనుండి అప్పటికప్పుడు
తేజస్సులు వెలువడి ఒక దివ్య తేజోరాసి అయిన స్త్రీమూర్తిగా రూపం దాల్చింది.
తరువాత దేవతలందరూ తమ ఆయుధాలను పోలివున్న ఆయుధాలను ఆమెకు బహుకరించడం
జరిగింది. ఇలా అనేక ఆయుధాలను ధరించిన ఆమె శక్తిస్వరూపినిగా అవతరించింది,
సింహవాహనాన్ని అధిష్టించి, మహాశక్తిరూపంతో మహిషాసురుడనే రాక్షసుడిని
సంహరించింది. ఈరోజు అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది.
శత్రుభయాలు తొలగిపోయి సకలవిజయాలు కలుగుతాయి.
మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు !
మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు !
Subscribe to:
Posts (Atom)