మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం శరదృతువు. వానలు తగ్గి, చలికాలం ఆరంభమయ్యే సమయంలో దీపావళి పండుగ రావడం సంతోషదాయకం...ఆనందదాయకం. చెడు అనే చీకటిని పారద్రోలి, మంచి అనే వెలుగును నింపడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. విజయానికి ప్రతీతగా ప్రతి ఇంటా చీకటిని పారద్రోలి... వెలుగులను నింపి, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్ర్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తాం. కులమతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు ఆనందంగా జరుపుకునే పండుగ వెలుగు జిలుగుల దీపావళి. ఈ రోజున లక్ష్మిదేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తే లక్ష్మి కటాక్షం సిద్దిస్తుందని ప్రజల విశ్వాసం. ఈ దివ్యకాంతుల దీపావళి మీ ఇంటిల్లిపాదికీ సుఖశాంతులు, సిరిసంపదలు, మధురానుభూతులు మిగిల్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు !
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు !
No comments:
Post a Comment