నాటి రామాయణం నుండి నేటి ఆధునిక
యుగం వరకు పరిశీలిస్తే, పరస్త్రీ వ్యామోహం కలవారెవరూ బాగుపడిన దాఖలాలు
లేవు. అనేక గొడవలకు, హత్యలకు కారణమయ్యే అత్యంత హేయమైన గుణం పరస్త్రీల పైన
మొహం. కామం మనిషిని గుడ్డివాడ్ని చేస్తుంది. చదువుకునే పిల్లల నుంచి,
కాటికి కాళ్ళు చాపే ముసలువాళ్ళ వరకు ఈ చెడు వ్యసనానికి బానిసలయి, ఎన్ని
దుర్మార్గాలు చేస్తున్నారో... జనం చేత ఎట్ల ఛీ అనిపించుకుంటున్నారో
చూస్తూనే ఉన్నాం. ఇల్లాలితో స్వర్గ సుఖాలను అనుభవించవలసిన జీవితాన్ని
చేజేతులా మురికి కూపంలోకి నేట్టుకుంటున్న అభాగ్యులు ఒక్కసారి
ఆలోచేస్తే...ఈ కామాంధకారంలోంచి బయటపడగలరు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, స్త్రీలను
ఆదరించడం మన సంస్కృతి.
No comments:
Post a Comment