వేడుకలు, శుభకార్యాల్లో విందు భోజనాల ఏర్పాటు చేయడం మన దేశ సంప్రదాయాలలో ఓ భాగం. అయితే ఇటీవల కొంత కాలంగా ఇలాంటి వేడుకలు ఆడంబర ప్రదర్శనాలుగా మారిపోయి, ఎంతో విలువైన ఆహార పదార్థాలను చెత్త కుప్పల పాలు చేయడం చూస్తున్నాం. దేశంలో కోట్లాది మంది తిండి దొరక్క అల్లాడుతుంటే విందులు, వినోదాల పేరిట ఆట్టహాసాలకుపోయి భారీగా ఆహారాన్ని వృధా చేయడం బాధాకరం. శుభకార్యాలను ఆడంబరంగా చేసుకోవచ్చు. కాని, ఆహారపదార్థాలను వృధా చేయడం బాగులేదు. ఆర్భాటాలకు పోయి ఎన్నో రకాల వంటలు చేసి వృధా చేసే బదులు అందరికీ ఇష్టమైన కొన్ని రకాల వంటలు చేస్తే...ఈ వృధాను చాలా వరకూ అరికట్టవచ్చు. అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొనే వాళ్ళు ఎంత వరకు తినగలరో అంత వరకే వడ్డించు కోవడం మరవద్దు. నచ్చకపోతే వృధాగా పారేయాలి కాబట్టి, నచ్చని ఆహార పదార్థాలను వడ్డించుకోకపోవడం ఉత్తమం. 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని మరచిపోవద్దు.
Saturday, 31 May 2014
'అన్నం పరబ్రహ్మ స్వరూపం'

Wednesday, 28 May 2014
ఇదీ ... మన వ్య(అ)వస్థ!
పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఓటర్ స్లిప్ తీసుకుని ఈవీఎం దగ్గరకి వెళ్ళిన ఓటరు రెండు నిముషాలు గడిచినా అక్కడ నుంచి రాక పోవడంతో...
ప్రెసిడింగ్ ఆఫీసర్ : "బాబు... నువ్వు ఓటు వేసినట్టు బజర్ మోగింది ఇక బైటకు వచ్చేయ్!"
ఓటరు: "ఒక్క ఓటే వేశాను... ఇంకా ఇద్దరికి వేయాలి"
ప్రెసిడింగ్ ఆఫీసర్ : " అలా కుదరదు... ఒక్క ఈవీఎం లో ఒక్కరికి మాత్రం ఓటు వేయాలి"
ఓటరు: "ఒక పార్టీ వాళ్ళు వెయ్యి రూపాయలు, మరో పార్టీ వాళ్ళు ఐదు వందలు, ఇంకొక పార్టీ వాళ్ళు, మందు, బిర్యాని ఇచ్చారు . అందుకే ఆ ముగ్గురికి ఓటు వేసి వాళ్ళ ఋణం తీర్చుకోవాలి "
పోలింగ్ సిబ్బందికి జుట్టు పీక్కునంత పనయింది .

Tuesday, 27 May 2014
"ది లెజెండ్"
' NTR 'ఈ మూడక్షరాలు ఒక ప్రభంజనం. ఒక సంచలనం. మంచి మానవతల మేలుకలయిక నందమూరి తారక రామారావు. పట్టుదల, కార్యదీక్ష ఆయన సొత్తు. కృషి, దీక్ష, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిబద్దత, మడమతిప్పని నిజం ఆయన సహజ కవచకుండలాలు. ఆంధ్రరాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆంద్రుల అభిమానానికి, ఆత్మగౌరవానికి ఆయన మారుపేరు. ప్రేక్షకులే నా ఆరాధ్య దైవం అని భావించే నందమారి చేసిన ప్రతి విన్యాసం జనబాహుళ్యాన్నిఉర్రూత లూపింది. సినిమా రంగంలో ఆయన పాటించిన క్రమ శిక్షణ ఎందరికో మార్గదర్శకమైంది. నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు జాతి మన్నలను పొందారు. సాంఘీక, జానపద,పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, సినీమానవ సరోవరంలో నిరంతరం విహరించే నట సింహం. తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస పరిమళ భరిత పారిజాతపుష్పం. అన్నిరకాల పాత్రలలో నటించి ప్రజల మన్నలను పొందారు. నమ్మిన వారిని ఆదరించడంలో ఆయనకు ఆయనే సాటి. నిక్కచ్చగా, నిజాన్ని దాచకుండా చెప్పడం ఆయన వ్యక్తిత్వంలో ఒక విశేషం. ఆత్మీయతను పంచడంలో తన పరభేదం లేకుండా ప్రేమను చూపించగలిగే ప్రేమశీలి. 1983 లో 'తెలుగుదేశం' పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలలోనే ముఖమంత్రి పీఠం అధిష్టించి, తెలుగువారి ఆత్మాభిమానం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు... దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇందిరాగాంధి నే 'డీ' కొన్న యోధుడు NTR. ఖండాంతరాలకు తెలుగు మాధుర్యాన్ని చవి చూపించారు. అటు సినీరంగంలోనూ...ఇటు రాజకీయరంగంలోనూ తనదైన ముద్రవీసిన రామారావు గారునిజంగా రియల్ హీరో. ఆయన సామాన్యుడు కాదు ...ఒక మహాశక్తి . ఎన్నో విశిష్టలున్న మహామనిషి.సినీరంగంలో శ్రీరాముడుగా , శ్రీ కృష్ణుడుగా, కర్ణుడుగా , దుర్యోధనునిగా, రావణాసురుడుగా వేసిన పాత్రలు అమోఘం. ఆ పాత్రలకు ఆయన ప్రాణం పోశారు.
సాహసాలు చేయడంలో ఆయనకి ఆయనే సాటి. అందుకు ఉదాహరణ రావణబ్రహ్మ పాత్ర. ఏదయిన ప్రయోగం చేయాలంటే , ముందుగా ఆయనమీదే చేసుకునేవారు. 'దాన వీర శూర కర్ణ ' చిత్రంలో మూడు పాత్రలు వేసి శభాష్ అనిపించారు. శ్రీమద్విరాటపర్వం లో ఏకంగా అయిదు పాత్రలు వేసి గొప్ప సాహసం చేసి విజయం సాధించారు. ఇలాంటి సాహసం మరే నటుడికి సాధ్యం కాదు అంటే అతిశయోక్తి కాదు. నటనలో లీనమై ప్రతిపాత్రకు న్యాయం చేకూర్చిన నటుడు. దాదాపు మూడువందల చిత్రాలలో నటించి, తెలుగువారి హృదయాలలో పదిలంగా స్థానం ఏర్పరచుకున్న NTR ధరించని పాత్ర లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్ చైర్మన్ గా , జాతీయస్థాయి నాయకుడిగా రామారావు గారు కీర్తి శిఖరం అధిరోహించారు. మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగంను ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు.
తన అసాధారణ నటనతో, ప్రతిభతో విశాల అభిమనలోకాన్నిఏర్పరచుకున్న అగ్రశ్రేణి నటుడు. సుందరమైన, సున్నితమైన, సునిశితమైన హాస్యం మేళవించి రంజింపజేసిన నటుడు. నటనలో లీనమై ప్రతీ పాత్రకు న్యాయం చేకూర్చిన నటసార్వభౌముడు. ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్ చైర్మన్గా, జాతీయ స్థాయి నాయకుడిగా, ప్రజల మనిషిగా రామారావు గారు కీర్తి శికరం అధిరోహించారు.
మరపురాని మరువలేని మహా నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి (మే 28) సందర్భంగా....
Sunday, 25 May 2014
పట్టాభిషేకం!
గత కొంత కాలంగా మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, బిజెపిని అంటారాని పార్టీగా ప్రచారం చేస్తూ బిజెపిని దెబ్బతీస్తూ వచ్చాయి. కాని, ప్రజలకు నిజం నిలకడగా తెలిసింది. బిజెపి అంటరాని పార్టీ అని ప్రచారం చేసిన పార్టీలనే 'అంటరానిపార్టీలు'గా ముద్రవేసి 2014 ఎన్నికలలో తీర్పునిచ్చారు. ఇది దేశానికి శుభపరిణామం. ఒకప్పుడు పార్లమెంటులో రెండు స్థానాలకే పరిమితమైన బిజెపి, ఇప్పుడు రెండువందల ఎనబైకి పైగా పార్లమెంటు స్థానాలు గెలుచుకొని బిజెపి అంటరాని పార్టీ కాదని నిరూపించుకుంది. అన్ని వర్గాలవారిని సమ్మోహన పరిచే శక్తి మోడీలో పుష్కలంగా ఉండడంతో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తన గంభీర ఉపన్యాసంతో ప్రజలను ఉర్రూతలూగించడంలో ఆయన సిద్దహస్తుడు. పట్టుదలతో, నిరంతర శ్రమను నమ్ముకుని అనుభవం నేర్పిన పాఠాలతో రాటుదేలిన యోధుడు ఆయన. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు !
Tuesday, 20 May 2014
Thursday, 15 May 2014
Tuesday, 13 May 2014
మల్లెల సౌరభం
మండుటెండల నుండి సేదతీర్చే మల్లెల్ని మించిన మనోహర పరిమళం మరెక్కడా ఉండదు. వీటిలో సుగంధ పరిమళం ఎక్కువ. వీటి సువాసన దంపతుల మధ్య ఇష్టాన్ని, మమకారాన్ని, ప్రేమానురాగాల్ని పెంచుతుంది. మల్లెల గుబాళింపు ఆహ్లాదంగా, ఎంతో కమ్మగా ఉంటుంది. గుండెల నిండా సంతోషాన్ని నింపి ఆనందాల్లో ముంచెత్తుతాయి. అసలు మల్లెల్ని చూస్తేనే మనసు పులకిస్తుంది. మైమరచి మయూరంలా నాట్యం చేస్తుంది. మల్లెపూల సువాసనకు విసుగు, అసహనాలు మన దరికి చేరవు. మహిళలు మల్లెలు ధరించడం వల్ల సుఖంగా, ఆనందంగా, హాయిగా నిద్ర పడుతుంది. పక్కవాళ్ళకి కూడా ఇలాంటి అనుభూతి కలుగుతుంది. అంతేకాదండోయ్... ఈ మల్లెల పరిమళం చుట్టూ పరిసరాలను పరచుకొని హాయిని కలిగిస్తాయి. కళ్ళ నుంచి మెదడు వరకూ ఆహ్లాదం కలిగించడంలో ఇవి చురుగ్గా పనిచేస్తాయి.
Saturday, 10 May 2014
'అ' అంటే... అనురాగం !
'అ' అంటే అనురాగం
'మ్మ' అంటే మమకారం
వెరసి అమ్మంటే ...
ప్రేమానురాగాల అమృత పాత్ర !
అందుకే...!
అమ్మ భగవంతుని ప్రతిరూపం ...
అమ్మ పిలుపు ఎంతో మధురాతి మధురం!
అమ్మ పదంలో కమ్మదనం ...
అమ్మ మనసు ఎంతో మెత్తదనం !
జీవితాన్ని ఇచ్చే మాతృమూర్తి...
ప్రేమను పంచే ప్రేమ మూర్తి...
తన బిడ్డల ఉన్నతికోసం ...
నిరంతరం శ్రమించే త్యాగమూర్తి !
మిత్రులందరికీ మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు!
Wednesday, 7 May 2014
Subscribe to:
Posts (Atom)