గత కొంత కాలంగా మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, బిజెపిని అంటారాని పార్టీగా ప్రచారం చేస్తూ బిజెపిని దెబ్బతీస్తూ వచ్చాయి. కాని, ప్రజలకు నిజం నిలకడగా తెలిసింది. బిజెపి అంటరాని పార్టీ అని ప్రచారం చేసిన పార్టీలనే 'అంటరానిపార్టీలు'గా ముద్రవేసి 2014 ఎన్నికలలో తీర్పునిచ్చారు. ఇది దేశానికి శుభపరిణామం. ఒకప్పుడు పార్లమెంటులో రెండు స్థానాలకే పరిమితమైన బిజెపి, ఇప్పుడు రెండువందల ఎనబైకి పైగా పార్లమెంటు స్థానాలు గెలుచుకొని బిజెపి అంటరాని పార్టీ కాదని నిరూపించుకుంది. అన్ని వర్గాలవారిని సమ్మోహన పరిచే శక్తి మోడీలో పుష్కలంగా ఉండడంతో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తన గంభీర ఉపన్యాసంతో ప్రజలను ఉర్రూతలూగించడంలో ఆయన సిద్దహస్తుడు. పట్టుదలతో, నిరంతర శ్రమను నమ్ముకుని అనుభవం నేర్పిన పాఠాలతో రాటుదేలిన యోధుడు ఆయన. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు !
No comments:
Post a Comment