”శోధిని”

Tuesday, 13 May 2014

మల్లెల సౌరభం


మండుటెండల నుండి సేదతీర్చే మల్లెల్ని మించిన మనోహర పరిమళం మరెక్కడా ఉండదు. వీటిలో సుగంధ పరిమళం ఎక్కువ. వీటి సువాసన దంపతుల మధ్య  ఇష్టాన్ని, మమకారాన్ని, ప్రేమానురాగాల్ని పెంచుతుంది.    మల్లెల  గుబాళింపు ఆహ్లాదంగా,  ఎంతో కమ్మగా ఉంటుంది.  గుండెల  నిండా సంతోషాన్ని నింపి ఆనందాల్లో ముంచెత్తుతాయి.  అసలు మల్లెల్ని చూస్తేనే మనసు పులకిస్తుంది.  మైమరచి మయూరంలా నాట్యం  చేస్తుంది.  మల్లెపూల సువాసనకు విసుగు, అసహనాలు మన దరికి చేరవు.  మహిళలు మల్లెలు ధరించడం వల్ల సుఖంగా, ఆనందంగా, హాయిగా నిద్ర పడుతుంది.  పక్కవాళ్ళకి కూడా ఇలాంటి అనుభూతి కలుగుతుంది.  అంతేకాదండోయ్... ఈ మల్లెల పరిమళం చుట్టూ పరిసరాలను  పరచుకొని హాయిని కలిగిస్తాయి.  కళ్ళ నుంచి మెదడు వరకూ ఆహ్లాదం కలిగించడంలో ఇవి చురుగ్గా పనిచేస్తాయి.  

No comments: