”శోధిని”

Saturday 15 March 2014

సరదాల రంగుల హోలీ...!


పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ  ఆనందోత్సాలతో... ఆహ్లాదంగా జరుపుకునే సరదా పండుగ హోలి.  వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి.  సంప్రదాయ బద్దమైన రంగుల పండుగ కాబట్టి  రంగు వచ్చే రకరకాల పూలతో, ముఖ్యంగా మోదుగ పూలతో తయారు చేసుకున్న రంగులతోనే హోలి జరుపుకోవడం ఉత్తమం.  కృత్రిమ రసాయనిక రంగులు వాడి చర్మ వ్యాధులు తెచ్చుకోవడం మూర్ఖత్వం.  అంతేకాదు రసాయనిక రంగులు వాడటం వలన కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉందని మరచిపోవద్దు.  రంగులు చల్లుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటూ,  సున్నితమైన రంగులతో సరదాగా కాసేపు ఆడుకుని, ఆవెంటనే వంటికి అంటిన రంగుల్ని తొలగించుకోండి.  ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ హోలి పండుగను ఆనందంగా జరుపుకోండి.

                        అందరికీ హోలీ శుభాకాంక్షలు!

2 comments:

Meraj Fathima said...

నాగేంద్ర గారూ, మొదటగా మీకు నా హృదయపూర్వక నమస్సులు ఎందుకో తెలుసా, ఎవరి పండుగైనా, మనస్పూర్తిగా శుభాకాంక్షలు పలుకుతారు కదా అందుకు, ఎవరికి పురస్కారం చేసినా, సత్కారం చేసినా నిండుమనస్సుతో దీవించే మీరూ, మీ కుటుంబమూ కలకాలము సుఖసంతోషాలతొ ఉండాలని ఓ సోదరిగా కోరుకుంటున్నాను, అభినందిస్తున్నాను.

కాయల నాగేంద్ర said...

మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు ఫాతిమా గారు!