”శోధిని”

Tuesday 25 March 2014

మంచి నాయకులను ఎన్నుకోండి !

ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే సిబ్బంది సమయానికి రారు... లేటుగా వచ్చినా సీట్లో కనిపించరు...ఒకవేళ కనిపించినా చేతులు తడవందే పని ప్రారంభించరు. ఇదీ మన రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల పరిస్ధితి.  చివరికి ఆఫీసర్ సంతకం అయిన తర్వాత కూడా  స్టాంప్ వేయడానికి  చేతులు చాపుతున్నారంటే ముమ్మాటికి ఇది  మన పాలకుల వైఫల్యమే.  నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులలో క్రమశిక్షణతో పాటు భయం కూడా ఉండేది.  ఉద్యోగి పోరపాటున కూడా చూయి చాపడానికి జంకేవాడు. కాని, నేడు తాము ప్రజల సేవకులమని మరచి దర్జాగా అవినీతికి పాల్పడుతున్నారు.  ఉద్యోగంలో కొత్తగా చేరుతున్న  యువకులు సైతం అదే బాటలో నడుస్తుంటే.. ఇక ఈ వ్యవస్థను కాపాడేదెవరు? అందుకే యువతీయువకుల్లారా  ఎన్నికల పైన దృష్టి పెట్టండి... ప్రజలల్లో విద్వేషాలను పెంచే నాయకుల భరతం పట్టండి.  ఓటు హక్కు వినియోగంలో అజాగ్రత్త వహిస్తే... ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని గుర్తించండి.  ప్రతి ఇంటిలోనూ, ప్రతి గ్రామం లోనూ ఓటు విలువను గురించి ప్రజలకు తెలియజేసే భాద్యతను తీసుకోండి.  కులం, మతం, ప్రాంతం, పార్టీలను చూడకుండా మంచి వ్యక్తులకు ఓటు వేయించేవిధంగా  కృషి చేయండి.  మోసగాళ్ళ ఉచ్చులో చిక్కుకున్న ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకురండి.  ప్రజలలో మార్పు వచ్చినప్పుడే మంచి నాయకులు ఎన్నుకోబడతారు.  మంచిపాలనను చూడగలుగుతాం. 

3 comments:

Anonymous said...

మీ మాట కాదనఏది కాదు కాని అందరూ దోంగలే ఎలా? ఎవరిని ఎన్నుకోవాలి?

Srinivasa Rao said...

అందరినీ ఒకే గాటన కట్టేస్తె ఎలా! మంచి వారు కూడా ఉంటారు కదా!. ప్రతి మనిషిలోనూ మార్పు రావాలి. అపుడె వ్యవస్థలో మార్పు వస్తుంది.

కాయల నాగేంద్ర said...

మీరు చెప్పింది ముమ్మాటికి నిజం శ్రేనివాస రావు గారు!