”శోధిని”

Thursday 20 February 2014

నీ రూపం మహాద్భుతం !


ప్రియా...!
నీ దరహాసాలు...
జలజల రాలే సన్నజాజులు !
నీ తీపి పలుకులు...
మంచి ముత్యాల సౌందర్యాలు  !
నీ మేని సుగంధాలు...
గుభాలించే పరిమళాలు !
నీ సొగసు సోయగాలు ...
మధురమైన జ్ఞాపకాలు  !
 నీ సుందర  నామం అద్భుతం ...
నీ దివ్య రూపం మహాద్భుతం  
అందుకే...!
నా శ్వాస నిన్నే స్మరిస్తోంది...
 నీ నామమే జపిస్తోంది !

5 comments:

gajula sridevi said...

నాగేంద్ర , మీ వర్ణన అపురూపం.

Meraj Fathima said...

రూప వర్ణన అద్బుతం. బాగుంది నాగేంద్ర గారు.

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు శ్రీదేవి గారు, ఫాతిమా గారు!

వనజ తాతినేని/VanajaTatineni said...

chaalaa Baavundi..Nagendra gaaru.

కాయల నాగేంద్ర said...

Thank You Vanaja Gaaru.