ఉదయభానుడు ధనూరాశి నుండి మకర రాశి లోనికి ప్రవేశించడమే ఉత్తరాయణం పుణ్యకాలంగా పరిగణింప బడుతుంది. అందువలన ఈ సంక్రాంతి పర్వ దినం చాలా శ్రేష్టమైనది. సంక్రాంతి నాడు చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయంటారు.మూడు రోజులు జరుపుకునే పెద్ద పండుగలో మొదటి రోజు భోగి పండుగ. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, ఇంట్లోని పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం ఆనవాయితి. ఇక రెండో రోజు సంక్రాంతి. ఈ రోజు పితృదేవతలను కొలిచి, వారి పేరున దాన ధర్మాలు చేస్తారు. సంక్రాంతి మరునాడు కనుమ పండుగ. ఈ పండుగను పశువుల పండుగ అనికూడా అంటారు. కనుమ రోజు పాలిచ్చి మనల్ని పోషిచే ఆవులను, వ్యవసాయంలో తమకెంతో తోడ్పడే ఎద్దులను పసుపు, కుంకుమలతో పూజించి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కోడి పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. ఇంకా గాలి పటాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు,రంగవల్లులు,రకరకాల పిండివంటలు.... ఇవన్నీ తిలకించాలంటే పల్లె దారి పట్టాలి.
మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
1 comment:
bomma baagundandi.
Post a Comment