అమ్మ పంచే అనురాగం, మమకారం,ఆత్మీయత అపురూపం
అమ్మ... ఓర్పు, సహనం, ప్రేమ, ఆప్యాయతలకు ప్రతిరూపం.
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!
అమ్మ బిడ్డకు జన్మనివ్వడానికే జీవిస్తుంది
ఒక్కోసారి ఆ బిడ్డ కోసమే మరణిస్తుంది...
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!!
అమ్మను మించిన దైవం లేదు...అమ్మే ప్రత్యక్ష దైవం
అమ్మ అనురాగం అపారం...అమ్మ త్యాగం అనితరం
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!!!
సృష్టికి మూలం అమ్మ...ఆప్యాయతకు అర్థం అమ్మ.
మమతల మకరందం అమ్మ...ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ.
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!!!!
'అమ్మ' అనే స్త్రీ మూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించినప్పుడే
సమాజం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుంది.
అందుకే స్త్రీలను గౌరవిద్దాం... మనసార పుజిద్దాం!
6 comments:
"అమ్మదనం ...ఎంతో కమ్మదనం!!!!"
మీకు కూడా 'మాతృదినోత్సవ' శుభాకాంక్షలు!!
అమ్మ తనం.. అమృతాన్ని పంచి ఇచ్చే అపురూప వరం.
మా తృ దినోత్సవ శుభా కాంక్షలు నాగేంద్ర గారు.
Thank you so much Nagendra garu. Maatrumoortulandarini abhinanadinchina meeku, mee post ki chaalaa thanks.
mamatala makarandam amma, manchi polika nagendra garu
రాజి గారు, వనజవనమాలి గారు, జలతారువెన్నెల గారు, ఫాతిమా గారు
అందరికీ ధన్యవాదాలు!
ఈ దేహం, ఈ జీవం, ఈ ఙానం, ఈ జీవితం అంతా అమ్మ పెట్టిన భిక్షే కదా.
Post a Comment