”శోధిని”

Thursday, 5 January 2012

'శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని యువత చూడాలి


ఆంధ్రభూమి  వెన్నెల



మీవ్యూస్


కళాప్రపూర్ణ, చిత్రబ్రహ్మ బాపు దర్శకత్వంలో ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీరామరాజ్యం’. ఈ సినిమా పండితుల, పామరుల ప్రశంసలు అందుకుంటోంది. నేటి తరం, రేపటి తరం వారు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునేలా బాపుఅత్యంత సుందరంగా ఈ చిత్రాన్ని తెర కెక్కించారు. సీతారాముల మధ్య ఉండే ప్రేమానురాగాలు చిత్రీకరించిన తీరు చాలా బాగుంది. ప్రతి సన్నివేశంలో బాపుగారు కనిపిస్తే, ప్రతి మాటలోనూ శ్రీరమణగారు గుర్తుకువస్తారు. అదే విధంగా ఆర్ట్ డైరెక్టర్ పనితనం ప్రతి సెట్‌లోనూ కనబడుతుంది. అలాగే ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పాటలన్నీ వినసొంపుగా, సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని శ్రీరాముడి పాత్రను చక్కగా పోషించాడు. సీత పాత్రలో నయనతార వొదిగిపోయి నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పవచ్చు.

- కాయల నాగేంద్ర, హైదరాబాద్

4 comments:

svk said...

neee bonda laa vndi

శ్యామలీయం said...

ఈ SVK గారు యెవరో!
అయ్యా, మీకు నచ్చితే సంతోషం బ్లాగు వ్రాసిన వారికి.
మీకు నచ్చక పోతే, ఆ మాటే చెప్పండి - వీలుంటే మీ వివరణతో.
తిట్టటం సభ్యత కాదు.

కాయల నాగేంద్ర said...

SVK ! నా బ్లాగ్ పైన అడ్డమైన రాతలు రాయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు.ఇలా సభ్యత లేని రాతలు రాస్తే నీకేమి లాభమో నాకర్థం కావడం లేదు. ఇలాంటి సంస్కారంలేని కామెంట్స్ రాయడంతో నీ వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమైంది. ఇంతకుముందు కూడా భగవద్గీత పైన ఇలాగే రాసారు. ముందుగా ఎదుటివారిని గౌరవించడం నేర్చుకో! తర్వాత బ్లాగుల పైన కామెంట్స్ రాయి. నీ పైన కోపం రావడం లేదు, జాలి కలుగుతోంది.

కాయల నాగేంద్ర said...

శ్యామలీయం గారు! మీ స్పందనకు ధన్యవాదాలు.