”శోధిని”

Saturday, 24 December 2011

'క్రిస్మన్' శుభాకాంక్షలు.

క్రిస్మస్ అటే దైవత్వం మానవత్వంలోకి ప్రవేసించిన రోజు. అందుకే ఈరోజు క్రైస్తవ సోదరసోదరీమణులు
భక్తితో పండుగ చేసుకుంటారు. అయితే విచిత్రమేమిటంటే ఈ పండుగలో ఏసుక్రీస్తు కంటే శాంటక్లాజ్,
క్రిస్మస్ ట్రీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండంతో అసలు సంగతి మరుగున పడిపోతోంది. ఏసుక్రీస్తుకి వేడుకలు,ఆర్భాటాలు అసలు నచ్చవు.
ఆయన ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని చెప్పాడు. అందుకే ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఈలోకంలోకి లోకరక్షకుడిగా వచ్చినందుకు ఏసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుని ఆరాదిస్తారు. అందుకే క్రిస్మస్ ను ఆరాధనాభావంతో చేసుకోవాలి. క్రిస్మస్ నాడు దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడాలి. ప్రభువైన ఏసుక్రీస్తు ఆర్భాటాలకోసంఈ లోకం రాలేదని, సత్యసువార్తను ప్రజలకు భోదించడానికి వచ్చాడని తెలుసుకోవాలి. " నీపట్ల నీవు ఎలా ప్రవర్తించుకుంటారో ఇతరుల పట్ల అలాగే వ్యవహరించు. పోరుగువారిని నీలాగా భావించి ప్రేమించు." ఇలాంటి వాక్యాలు కోకొల్లలు. హిందువులు 'శివరాత్రి'ని ఎంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారో, ముస్లీములు 'రంజాన్' ఎంత పవిత్రంగా చేసుకుంటారో అంతే భక్తి శ్రద్దలతో క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రైస్తవ సోదరసోదరీమణులకు 'క్రిస్మన్' శుభాకాంక్షలు.

2 comments:

ఎందుకో ? ఏమో ! said...

In my view

there is a small correction

అసలు సంగతి మరుగున పడిపోతోంది
will be like this
అసలు సంగతి మరుగున పడిoది
----------------------------------

క్రిస్మస్ నాడు దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడాలి. ప్రభువైన ఏసుక్రీస్తు ఆర్భాటాలకోసంఈ లోకం రాలేదని, సత్యసువార్తను ప్రజలకు భోదించడానికి వచ్చాడని తెలుసుకోవాలి. "
-----------------------------------

Coming to my view

the people who are living in this "AD"

all are to be inspire by Jesus Christ

'క్రిస్మన్' శుభాకాంక్షలు.

కాయల నాగేంద్ర said...

థాంక్స్! ఎందుకో? ఏమో!