”శోధిని”

Wednesday, 10 March 2021

మహా శివరాత్రి శుభాకాంక్షలు!

శివుడు లింగరూపంలో ఉద్భవించిన పుణ్యదినం మహా శివరాత్రి.  మంగళకరమైన మహా శివరాత్రి నాడు శివునికి అభిషేకం, పగలు ఉపవాసం, రాత్రి జాగారణ చేసి భక్తితో కొలిచిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు, సకల శుభాలు కలుగుతాయని చెబుతారు.  అహంభావాన్ని వదలి, అహంకారాన్ని వీడి అందరిని సమభావంతో ప్రేమిస్తే శివుని కరుణాకటాక్షం తప్పక లభిస్తుంది.  'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రం అజ్ఞానంధకారాన్ని పోగొట్టి మోక్షానిస్తుంది. పర్వదినాన అందరికి శంకరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం.

 

Thursday, 24 December 2020

క్రిస్మస్ శుభాకాంక్షలు !

మన మనసును పరిశుద్ధంగా వుంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. దాంతో సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదం, ఆశీస్సులు మనకు లభిస్తాయి.  ఇతరుల సంతోషం కోసం, వారి సుఖసౌఖ్యాల కోసం ప్రార్థన చేయమని,  సాటి మనిషిని మనస్పూర్తిగా ప్రేమించమని ఏసుక్రీస్తు చెప్పాడుఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని ఆయన చెప్పాడు. అందుకే ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి.         

మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు !

Saturday, 24 October 2020

'బతుకమ్మ పండుగ' శుభాకాంక్షలు!

దేవిశరన్నవరాత్రులలో ప్రకృతిని ఆరాధించే పెద్దపండుగ బతుకమ్మ పండుగ. అసమానతలను ఎదురిద్దాం...ఆత్మగౌరవంతో బతుకుదాం అంటూ ఆడపడుచులు ఉత్సాహంగా , ఆనందంగా ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ముత్తయిదువులంతా గౌరీదేవి దీవెనలను కోరుతూ... తమ మాంగల్య సౌభాగ్యం చల్లగా ఉండాలని ప్రార్థిస్తే, యువతులు తమకు మంచి భర్త లభించి, దాంపత్య జీవనం సుఖసంతోషాలతో సాగాలని వేడుకుంటారు. కుల, మతాలకతీతంగా వాడవాడలో జరుపుకునే బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని, మహిళలను గౌరవించాలని.