జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి
విజయాలను దరిచేర్చేవాడు విఘ్నేశ్వరుడు. నిందలను, విఘ్నాలను తొలగించి ముక్తిని
ప్రసాదించే గణనాధుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా
లభిస్తుంది.
భాష ఏదయినా, మతం ఏదయినా పెళ్లి ప్రమాణాల అర్థం ఒక్కటే! భాగస్వామిని ప్రేమిస్తానని, గౌరవిస్తానని, కష్టశుఖాల్లో తోడూ నీడగా నిలుస్తానని చెప్పడమే! ఆ ప్రమాణాలకు కట్టుబడి భార్యాభర్తలు తమ జీవన విధానాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మలచుకోవాలి. సంసారం అన్నాక అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. తాము అనుకున్నట్టుగానే జరిగితే బాగుంటుందని ఇద్దరికీ ఉంటుంది. ఎవరికివారే తమ మాటే నెగ్గాలన్న అహంకారం ప్రదర్శిస్తే, చినికి చినికి గాలి వాన అవుతుంది. తెలివైన దంపతులయితే స్నేహపూరిత వాతావరణంలో సామరస్యంగా మంచి చెడులను విశ్లేషించుకుని తగిన నిర్ణయం తీసుకుంటారు.