మనసున.. మనసై !
భాష ఏదయినా, మతం ఏదయినా పెళ్లి ప్రమాణాల అర్థం ఒక్కటే! భాగస్వామిని ప్రేమిస్తానని, గౌరవిస్తానని, కష్టశుఖాల్లో తోడూ నీడగా నిలుస్తానని చెప్పడమే! ఆ ప్రమాణాలకు కట్టుబడి భార్యాభర్తలు తమ జీవన విధానాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మలచుకోవాలి. సంసారం అన్నాక అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. తాము అనుకున్నట్టుగానే జరిగితే బాగుంటుందని ఇద్దరికీ ఉంటుంది. ఎవరికివారే తమ మాటే నెగ్గాలన్న అహంకారం ప్రదర్శిస్తే, చినికి చినికి గాలి వాన అవుతుంది. తెలివైన దంపతులయితే స్నేహపూరిత వాతావరణంలో సామరస్యంగా మంచి చెడులను విశ్లేషించుకుని తగిన నిర్ణయం తీసుకుంటారు.
No comments:
Post a Comment