”శోధిని”

Saturday, 11 February 2017

"అహంభావం"


ఇతరుల గురించి తేలిగ్గా మాట్లాడటమే అహంకారానికి పరాకాష్ట.  ఎక్కడ అహంకారం వుంటుందో అక్కడ స్వార్థం తప్పకుండా వుంటుంది.  అహంభావులతో ఎప్పటికైనా  సమస్యలు తప్పవు.   ఇటువంటి వారికి ఎంత వీలయితే అంత దూరంగా ఉండటం శ్రేయస్కరం.   ఇగో, అహాన్ని వదులుకోలేనివాళ్ళు ఎవరినీ ప్రేమించలేరు.  అలాగే ఎవరికీ ప్రేమను అందించలేరు....ఎదుటివారి ప్రేమను సరిగా స్వీకరించలేరు.  ఇలాంటివాళ్ళు ఎదుటివాళ్ళ ముందు తమ అహం ఎక్కడ దెబ్బతింటుందోనని మేకపోతు గాంభీరం వహిస్తారు.  బయటకి ఎంత వినయం, విధేయతలను ప్రదర్శించినా లోపల మాత్రం గర్వం, అసూయ, అహం లాంటి దుర్గుణాలు పెరుగుతూనే ఉంటాయి.    ఎంత గొప్పవాడయినా, ఎంత పెద్ద పదవిలో వున్నా అహంకారం లేకుండా వుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుంది. 


Thursday, 2 February 2017

"పరమ పవిత్రం రథసప్తమి"

ఆదిత్య కశ్యయపులకు  పుట్టిన సూర్యభగవానుడి జన్మదినం రథసప్తమి.  ఇతర మాసాలలో వచ్చే సప్తమి తిధుల కన్నా మాఘమాసంలో వచ్చే ఈ సప్తమి ఎంతో విశిష్టమైంది.  అంతేకాదు రధసప్తమి నాడు సూర్యుడు తన రథాన్ని ఉత్తరం దిక్కుకు మళ్లించినరోజు.  ఈ రోజు నుంచే  సూర్యుని తీక్షత క్రమేణా పెరుగుతుంది.   సమస్త ప్రాణకోటి జీవనాధారానికి, సకల జీవుల సంపూర్ణ ఆరోగ్యానికి సూర్యభగవానుడే మూలం.  సూర్యుడు ఉదయం బ్రహ్మ స్వరూపముగానూ, మధ్యాహ్నం శివుడుగాను, సాయంత్రం వేళ విష్ణువుగానూ ఉంటాడని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.  ప్రతిరోజూ ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడిని అర్చించిన వారికి ఆయురారోగ్యఐశ్వర్యాలు ప్రాపిస్తాయంటారు.  

Tuesday, 31 January 2017

"రాణివాసం"



అప్సరస లాంటి స్త్రీ మూర్తిని సృష్టించాలని  అలుపెరగకుండా బొమ్మను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్న బ్రహ్మదేవుడిని  చూసిన మన్మధుడు చిరునవ్వును చిందిస్తూ  పూల బాణాన్ని వదిలాడు.  అంతే, ఒక్కసారిగా బ్ర్రహ్మదేవుడిలో కొత్త ఉత్సాహం ఆవహించింది.  సన్నజాజులు, మల్లెలు, కలువపూలు, గులాబీలు, మందారాలను కుప్పగా పోసి రంగరించి అపురూపమైన బొమ్మను తయారు చేశాడు.  అప్పటినుంచి భూలోకంలో కవులకి కధానాయిక దొరికింది.  అప్పటివరకు రాజకుమారి అంటే ఎలా ఉంటుందో తెలియని దర్శకులకు  ఇలా ఉంటుందని తెల్సింది.  నడకలో రాణివాసఠీవి, నవ్వుల్లో చల్లని వెన్నెల, చూపుల్లో వలపులతో పాటు రాజసం... వీటన్నిటి కలయికే మన అందాల రాకుమారి శ్రియ.